Viral : వీడిదుంప తెగ‌.. ఒకేసారి ఐదుగురు గర్ల్ ఫ్రెండ్స్‌ను ప్రెగ్నెంట్ చేశాడు.. అది చాల‌దు అన్న‌ట్లు..

ఓ సంగీత క‌ళాకారుడు ఒకేసారి ఐదుగురితో లివ్ ఇన్‌లో ఉండ‌డ‌మే కాదు ఆ ఐదుగురిని గ‌ర్భ‌వ‌తుల‌ను చేశాడు.

Viral : వీడిదుంప తెగ‌.. ఒకేసారి ఐదుగురు గర్ల్ ఫ్రెండ్స్‌ను ప్రెగ్నెంట్ చేశాడు.. అది చాల‌దు అన్న‌ట్లు..

Man hosts joint baby shower for five women he got pregnant

Updated On : January 22, 2024 / 7:32 PM IST

Viral : చాలా మంది యువకులు పెళ్లి కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా వారికి పెళ్లి కుదరడం లేదు. అమ్మాయి దొర‌క‌డం లేదంటూ మంత్రులు, అధికారుల‌కు ఉత్త‌రాలు రాసిన ఘ‌ట‌న‌లు మ‌నం చూశాం. అయితే.. ఇప్పుడు చెప్ప‌బోయేది ఇందుకు చాలా భిన్నం. మ‌న‌దేశంలో కాస్త త‌క్కువ కానీ విదేశాల్లో లివ్ ఇన్ రిలేష‌న్ షిప్ కామ‌న్ అన్న సంగ‌తి తెలిసిందే. ఓ సంగీత క‌ళాకారుడు ఒకేసారి ఐదుగురితో లివ్ ఇన్‌లో ఉండ‌డ‌మే కాదు ఆ ఐదుగురిని గ‌ర్భ‌వ‌తుల‌ను చేశాడు. అయితే.. ఒక‌రితెలియ‌కుండా మ‌రొక‌రిని చేశాడో ఎలా చేశాడో తెలీదు గానీ అంద‌రిని ఓ చోట చేర్చి అంద‌రికీ ఒకేసారి బేబీ ష‌వ‌ర్‌ వేడుక నిర్వ‌హించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

న్యూయార్క్‌కు చెందిన సంగీత‌కారుడు జెడ్డీ విల్ ఐదుగురు గ‌ర్‌ఫ్రెండ్స్‌ను మెయింటెన్ చేస్తున్నాడు. వీరింద‌రిని ఒకేసారి గ‌ర్భ‌వ‌తుల‌ను చేశాడు. అంతేనా వీరింద‌రిని ఒప్పించి ఇటీవ‌ల ఎంతో ఘ‌నంగా అంద‌రికి ఒకేసారి బేబీ ష‌వ‌ర్‌ వేడుక నిర్వ‌హించాడు. ఈ వేడుక‌కు సంబంధించి కాబోయే త‌ల్లుల‌లో ఒక‌రైన యాష్లీ షేర్ చేసిన టిక్‌టిక్ వీడియో ద్వారా ఈ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది.

Sandwich : అమ్మ‌కానికి స‌గం తిన్న శాండ్‌విచ్‌.. కొనేందుకు జీవితం స‌రిపోదు..! ధ‌ర తెలిస్తే షాకే..!

ఇన్విటేష‌న్‌లో “వెల్‌కమ్‌ లిటిల్ జెడ్డీ విల్స్ 1-5” అని రాసి ఉంది. యాష్లీతో పాటు మిగిలిన గర్ల్‌ఫ్రెండ్స్ బోనీ బి, జిలీన్ విలా, కే మేరీ, ఇయాన్లా కలీఫా గల్లెట్టిల‌తో జెడ్డీ విల్ క‌లిసి దిగిన గ్రూప్ ఫోటోను షేర్ చేసింది. మేమంద‌రం ఇప్పుడు సోద‌రీమ‌ణులుగా భావించుకుంటున్నాము అని అనుకుంటున్నాను అని యాష్లీ అంది. అంతేకాదండోయ్ ఈవెంట్‌కు సంబంధించిన ప‌లు ఫోటోల‌ను షేర్ చేసింది. ఆ ఫోటోల్లో వీరంద‌రూ ఎంతో ఆనందంగా ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది. అంద‌రూ క‌లిసి డ్యాన్స్ చేశారు. జెడ్డీ ఓ చైర్‌లో కూర్చుంటే అత‌డి ప్రియురాళ్లు అంద‌రూ అత‌డి చుట్టూ ఉండ‌డాన్ని చూడొచ్చు. ఈయ‌నే మా పిల్ల‌ల డాడీ అంటూ యాష్లీ ఓ ఫోటోపై క్యాప్ష‌న్ ఇచ్చింది.

ఇది వైర‌ల్‌గా మారింది. దీన్ని చూసిన చాలా మంది ఆశ్చ‌ర్య‌పోతున్నారు. కొంద‌రు శుభాకాంక్ష‌లు చెబుతుండ‌గా మ‌రికొంద‌రు మాత్రం ఇది నిజంగా నిజ‌మేనా..? న‌మ్మేట‌ట్లుగా లేదే.? లైకుల కోసం ఇలా చేయ‌ట్లేదుగా అని మ‌రికొంద‌రు అంటున్నారు. ఇక సింగిల్‌గా ఉన్న వాళ్లు మాత్రం మాకు ఒక్క‌రు కూడా లేదు నీకు మాత్రం ఐదుగురు కావాల్సి వ‌చ్చిందా..! టూ మ‌చ్ బ్రో అంటూ స‌ర‌దాగా కామెంట్లు పెడుతున్నారు.

Lillian Droniak : ప్రేమలో మోసపోయిన 93 ఏళ్ల బామ్మ.. 2023లో ఎంత మందితో డేటింగ్ చేసిందో తెలుసా..?

 

View this post on Instagram

 

A post shared by Lizzy Ashliegh (@lizzyashmusic)