Sandwich : అమ్మ‌కానికి స‌గం తిన్న శాండ్‌విచ్‌.. కొనేందుకు జీవితం స‌రిపోదు..! ధ‌ర తెలిస్తే షాకే..!

శాండ్‌విచ్.. ఈ పేరు చెప్ప‌గానే మ‌న‌లో చాలా మందికి నోరు ఊరుతుంది.

Sandwich : అమ్మ‌కానికి స‌గం తిన్న శాండ్‌విచ్‌.. కొనేందుకు జీవితం స‌రిపోదు..! ధ‌ర తెలిస్తే షాకే..!

Half eaten sandwich

Updated On : January 16, 2024 / 3:42 PM IST

శాండ్‌విచ్.. ఈ పేరు చెప్ప‌గానే మ‌న‌లో చాలా మందికి నోరు ఊరుతుంది. ఇందులో చాలా ర‌కాలు, ఎన్నో రుచులు ఉంటాయి.

ప్ర‌పంచంలోని దాదాపు అన్ని దేశాల్లో ఇది ల‌భిస్తోంది. ఇక మ‌న‌దేశంలో రూ.30 నుంచి రూ.40 మ‌ధ్య‌ దీని ధ‌ర ప్రారంభ‌మ‌వుతుంది. ఇక గ‌రిష్టంగా రూ.500 నుంచి రూ.1000 వ‌ర‌కు ఉంటుంది. కాగా.. సగం తిన్న శాండ్‌విచ్ ధ‌ర ఎంత ఉంటుంది అనే ప్ర‌శ్న మీకు ఎదురైతే ఏ స‌మాధానం చెబుతారు.

ఏంటీ..? స‌గం తిన్న శాండ్‌విచా.. మీకేమ‌న్న పిచ్చి ప‌ట్టిందా అని అన‌క మాన‌రు. అయితే.. ఫేస్‌బుక్‌లో స‌గం తిన్న శాండ్‌విచ్‌ను అమ్మ‌కానికి పెట్టారు. అది కూడా ఓ వంద‌కో, వెయ్యికో అనుకుంటే మీరు త‌ప్పులో కాలేసిన‌ట్లే. ఏకంగా రూ.10 కోట్లు. అవును ఇది నిజ‌మే. న్యూయార్క్ పోస్ట్ ఈ మేర‌కు ఓ క‌థ‌నాన్ని పోస్ట్ చేసింది. ఫేస్‌బుక్ మార్కెట్‌ప్లేస్‌లో అమ్మకానికి పెట్టిన‌ట్లు వెల్ల‌డించింది.

Viral Video : పులితో ప‌రాచ‌కాలు వ‌ద్దు బాబాయ్‌..! వీడియో వైర‌ల్‌

ఇక్క‌డ ప్ర‌జ‌లు ఉప‌యోగించిన వ‌స్తువుల‌ను కూడా కొనుక్కోవ‌చ్చు. ఈ క్ర‌మంలోనే కొత్త గ్రిల్డ్, సగం తిన్న శాండ్‌విచ్‌ను ఇంగ్లాండ్‌లోని లీసెస్ట‌ర్‌కు చెందిన ఓ వ్య‌క్తి దీన్ని అమ్మ‌కానికి పెట్టాడు. దీని ధ‌ర 1.3 మిలియ‌న్ డాలర్ల‌గా నిర్ణ‌యించారు. అంటే భార‌త క‌రెన్సీలో దాదాపు రూ.10 కోట్లు అన్న మాట‌. శాండ్‌విచ్‌కు సంబంధించిన వివ‌రాలను పోస్ట్ చేశాడు. ఇందులో కొంత మాంసం, చీజ్ ఉన్న‌ట్లు చెప్పాడు. శాండ్‌విచ్ చాలా క్రిస్పీగా ఉన్న‌ట్లు అభివ‌ర్ణించాడు. దీన్ని కొన్న‌వారు పూర్తిగా తిన‌క‌పోవ‌డంతోనే విక్ర‌యిస్తున్న‌ట్లు రాసుకొచ్చాడు. దీన్ని చూసిన చాలా మంది ఆశ్చ‌ర్య‌పోతున్నారు. అయితే.. దీన్ని ఎవ‌రైనా కొన్నారా లేదా అన్న వివ‌రాలు తెలియ‌రాలేదు.

Viral Video : భార్య కోరికను తీర్చేందుకు.. 13,000 కిలోమీట‌ర్లు తీసుకువెళ్లి..

అయితే.. ఫేస్‌బుక్ లాంటి ప్లాట్‌ఫామ్‌లో ఇలాంటివి పోస్ట్ చేయ‌డం ఇదే తొలిసారి కాదు. ఇంత‌క‌ముందు చాలా మంది ఇలా చేశారు.