Viral Video : పులితో పరాచకాలు వద్దు బాబాయ్..! వీడియో వైరల్
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) అనగానే ఎత్తైన ఆకాశహర్మ్యాలు, లగర్జీ కార్లు, విలాసవంతమైన జీవితాలు గుర్తుకువస్తుంటాయి.

Pet Tiger Chases Man In Lavish Dubai Home
Viral Video : యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) అనగానే ఎత్తైన ఆకాశహర్మ్యాలు, లగర్జీ కార్లు, విలాసవంతమైన జీవితాలు గుర్తుకువస్తుంటాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఎన్నో కనబడుతుంటాయి. ఇక్కడి సంపన్నులు పులులు, సింహాలు, చిరుతలు వంటి వన్యప్రాణులను పెంపెడు జంతులుగా చేసుకుంటూ వాటితో పబ్లిక్ బీచ్‌ల వెంట నడస్తూ ఫోటోలు, వీడియోలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. తాజాగా ఓ విలాసవంతమైన ఇంటిలో ఓ వ్యక్తిని పెంపుడు పులి వెంటాడిన వీడియో వైరల్‌గా మారింది.
ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియోలో.. యూఏఈలోని ఓ ఇంటిలో విశాలమైన గదిలో ఓ వ్యక్తిని పెంపుడు పులి వెంటబడడం కనిపించింది. మొదట్లలో పులి తరుముతుంటే అతడు నవ్వుతూ కనిపించాడు. అయితే.. పరిగెడుతూ దాని నుంచి తప్పించుకునే క్రమంలో అతడు నేలపై పడిపోతాడు.
Viral video : వంట చేయడానికి ఇంకే నీళ్లూ దొరకలేదా తల్లీ.. ఉన్నరోగాలు చాలవా?
పులి అతడిని పట్టుకోవడం ఆపలేదు. దీంతో అతడు భయపడిపోతాడు. లేచి మళ్లీ పరిగెత్తడానికి ప్రయత్నించడం వీడియోలో చూడొచ్చు. ఇలాంటివి మిడిల్ ఈస్ట్‌లో మాత్రమే అంటూ ఈ వీడియోకి క్యాప్షన్ ఇచ్చారు.
ఈ వీడియోను ఇప్పటికే నాలుగు మిలియన్ల మందికి పైగా వీక్షించారు. జంతువుల స్వేచ్ఛను హరిచడం తప్పు అని ఒకరు కామెండ్ చేయగా.. పులితో పరాచకాలు వద్దు బ్రో.. ఎంతైనా అది పులి అంటూ మరొకరు అన్నారు.
View this post on Instagram
Viral Video : గ్యాస్ స్టవ్‌ను ఇలా వెలిగించాలని తెలియక.. ఎన్ని లైటర్లు కొన్నామో..!