Dong Jingwei : అమెరికా పారిపోయిన చైనా కీలక నేత.. బైడెన్ చేతిలో వూహాన్ ల్యాబ్ సీక్రెట్స్!

కరోనా వైరస్ వుహాన్‌ ల్యాబ్‌ నుంచే లీక్ అయిందంటూ వినిపిస్తున్న వాదనలు బలం చేకూర్చేలా..చైనా కమ్యూనిస్ట్ పార్టీలో కీలక వ్యక్తి ఒకరు అమెరికాకి పారిపోయి వుహాన్‌ ల్యాబ్‌ కి సంబంధించిన కీలక సమాచారాన్ని వారికి చెప్పినట్లు అంతర్జాతీయ మీడియాలో ప్రచారం జరగుతోంది.

China’s Top Official Defected To US కరోనా వైరస్ వుహాన్‌ ల్యాబ్‌ నుంచే లీక్ అయిందంటూ వినిపిస్తున్న వాదనలు బలం చేకూర్చేలా..చైనా కమ్యూనిస్ట్ పార్టీలో కీలక వ్యక్తి ఒకరు అమెరికాకి పారిపోయి వుహాన్‌ ల్యాబ్‌ కి సంబంధించిన కీలక సమాచారాన్ని వారికి చెప్పినట్లు అంతర్జాతీయ మీడియాలో ప్రచారం జరగుతోంది. చైనా స్టేట్ సెక్యూరిటీ డిప్యూటీ మినిస్టర్ గా మరియు 2018 నుంచి చైనా కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ ఆపరేషన్స్‌ వ్యవహారాలకు అధిపతిగా ఉన్న డాంగ్‌ జింగ్‌వుయ్‌(57)ఈ ఏడాది ఫిబ్రవరిలో తన కూతరితో కలిసి అమెరికాకి చేరుకున్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. మొదట హాంకాంగ్ వెళ్లిన అతడు..అక్కడి నుంచి అమెరికాకు పారిపోయినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన అమెరికా డిఫెన్స్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ కస్టడీలో ఉన్నట్లు పేర్కొన్నాయి.

అయితే నిజంగానే డాంగ్‌ అమెరికాకు పారిపోతే మాత్రం చైనా గూఢచర్య నెట్‌వర్క్‌కు చావుదెబ్బ తగిలినట్లేనని చెబుతున్నారు. వుహాన్‌ ల్యాబ్‌లో చైనా సైన్యం కార్యకలాపాలు, అమెరికాలో ఉన్న చైనా వేగుల సమాచారం మొత్తం లీకైయ్యే పరిస్థితి ఉంది. ఇది నిజమైతే చైనా చరిత్రలోనే అతిపెద్ద వెన్నుపోటుగా స్పై టాక్‌ న్యూస్‌ లెటర్‌ పేర్కొంది. స్పైటాక్‌ సంస్థ అమెరికా ఇంటెలిజెన్స్‌, విదేశాంగ విధానంపై కీలక సమాచారం ఇస్తుంటుంది. 1989లో తియనాన్మెన్‌ స్క్వేర్‌ ఘటన తర్వాత ఆయన అమెరికాకు వలస వచ్చిన చైనా మాజీ విదేశాంగశాఖ మంత్రి హాన్‌ లియాన్చావ్‌ జూన్‌ 16వ తేదీన డాంగ్‌ విషయాన్ని ట్వీట్‌ చేయడంతో ఈ వ్యవహారం బయటి ప్రపంచానికి తెలిసింది. వాస్తవానికి డాంగ్‌ అంశాన్ని మార్చిలో అలాస్కాలో జరిగిన అమెరికా-చైనా సమావేశంలో ప్రస్తావనకు వచ్చిందని ఆయన పేర్కొన్నారు. డాంగ్‌ను అప్పగించాలని అమెరికా సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ ఆంటోని బ్లింకన్‌, ఎన్‌ఎస్‌ఏ జాక్‌ సలైవాన్‌ వద్ద చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యి కోరినట్లు పేర్కొన్నారు. ఈ అభ్యర్థనను అమెరికా తోసిపుచ్చిందని వెల్లడించారు.

మరోవైపు,డాంగ్‌ జింగ్‌వుయ్‌ అదృశ్యంపై డ్రాగన్‌ కూడా ఆందోళన చెందుతోందని..కానీ ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించడంలేదని సమాచారం. చైనా సోషల్‌ మీడియా వేదికలపై ఇదే అంశం చర్చనీయాంశంమైంది. అయితే చైనా అధికారిక మీడియా మాత్రం జూన్‌ 18న డాంగ్‌ ఒక సింపోజియంలో పాల్గొన్నట్లు పేర్కొంటోంది. నమ్మకద్రోహుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని డాంగ్ హెచ్చరించారని చైనా పత్రిక చెబుతోంది.

ట్రెండింగ్ వార్తలు