Chinese craft carrying Moon rocks returns to Earth : చైనా చాంగే-5 మిషన్ సక్సెస్ అయింది. చైనీస్ మానవ రహిత అంతరిక్ష నౌక భూమికి విజయవంతంగా తిరిగి వచ్చింది. చంద్రునిపై సేకరించిన రాళ్లు, మట్టి నమూనాలతో సురక్షితంగా భూమిని చేరుకుంది. నాలు దశబ్దాల కాలంలో చైనా చంద్రునిపై నమూనాలు సేకరించిన మిషన్లలో మొట్టమొదటి మిషన్ ఇదే కావడం విశేషం.
నవంబర్ 23న లాంగ్ మార్చ్ 5 రాకెట్ ద్వారా Chang’e-5 మిషన్‌ను చైనా లాంచ్ చేసింది. Chang’e-5 అంతరిక్ష పరిశోధనలో భాగంగా చంద్రుని నుంచి రాళ్ల నమూనాలను ఫొటోలు తీసింది. ఉత్తర చైనా లోపలి మంగోలియా ప్రాంతంలో చాంగే-5 అంతరిక్ష నౌక సురక్షితంగా ల్యాండ్ అయింది.
చంద్రునిపై నమూనాలను ఒక క్యాప్సల్ లో క్యారీ చేసి తీసుకొచ్చిందని చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (CNSA) ఒక ప్రకటనలో వెల్లడించింది. ఏజెన్సీ డైరెక్టర్ జియాంగ్ కేజియన్ Chang’e-5 మిషన్ సక్సెస్ అయిందని వెల్లడించారు. ఈ మిషన్ విజయవంతం కావడంతో చంద్రునిపై నుంచి నమూనాలను భూమికి తీసుకొచ్చిన మూడో దేశంగా చైనా అవతరించింది.
అంతకుముందు అమెరికా, సొవియేట్ యూనియన్ 1960,1970లో చంద్రునిపై నుంచి నమూనాలను సేకరించిన మొదటి రెండు దేశాలుగా నిలిచాయి. చైనా పురాణ చంద్రదేవత పేరుతో చాంగే-5 అంతరిక్ష మిషన్ చేపట్టిన చైనా స్పేస్ క్రాఫ్ట్ డిసెంబర్ 1 చంద్రునిపై ల్యాండ్ అయింది. అక్కడే తమ జాతీయా జెండాను డ్రాగన్ పాతింది. చంద్రుని ఉపరితలంపై రాళ్లు, మట్టి నమూనాలను సేకరించిన అనంతరం రెండు రోజుల తర్వాత భూమికి తిరుగు పయనమైంది.