Delta Variant Ceses
Chinese Officials Locking People Inside Their Houses : కరోనా వైరస్‌ను ప్రపంచానికి అంటగట్టిన చైనా మరోసారి అదే మహమ్మారితో బెంబెలెత్తిపోతోంది. చైనాలో డెల్టా వేరియంట్ కేసులు పెరిగిపోతుండటంతో డ్రాగన్ దేశంలో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనాతో పోలిస్తే డెల్టా వేరియంట్ చాలా ఫాస్టుగా వ్యాపించటంతో అధికారులు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు.వైరస్ కట్టడి కోసం అధికారులు వినూత్న చర్యలు చేపట్టారు. ‘టెల్టా వేరింట్ బూచీ..ఎక్కడికక్కడ జనాలు అక్కడే గప్ చిప్ అంటూ జనాలను ఇళ్లనుంచి బయటకు రానివ్వకుండా.. ఇళ్లలో పెట్టి తాళం వేసేస్తున్నారు. జనాలను ఇళ్లల్లో పెట్టిన తాళాలు వేస్తున్న ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. చైనా సోషల్ మీడియా యాప్ వీబోలో దర్శనమిస్తున్నాయి.
వుహాన్ అంటే అందమైన నగరం అనే మాట కంటే వుహాన్ అంటే కరోనా అనేదే గుర్తుకొస్తుంది. అటువంటి వుహాన్ లో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచం అంతటా వ్యాపించి తిరిగి తిరిగి మళ్లీ చైనాకు చేరుకుంది. పలు రకాలుగా రూపాంతరాలు చెందిన కరోనా డెల్టా వేరియంట్ కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి వుహాన్‌లో. దీంతో డెల్టా వేరియంట్ ను నియంత్రించటానికి అధికారులు జనాల ఇళ్లపై పడ్డారు. ఇళ్లకు తాళాలు వేసేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
వీబో, ట్విట్టర్, యూట్యూబ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియోల్లో.. పీపీఈ కిట్‌లు ధరించిన కొందరు వ్యక్తులు.. జనాల ఇళ్లకు వెళ్లి వారిని లోపలకి పంపించేసి బయట తాళం వేయడమే కాక ఇనుపరాడ్లు పెట్టి.. సీల్ చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. దీనిపై అధికారులు.. వేరియంట్ కేసులు పెరుగుతున్న క్రమంలో తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా చేయాల్సి వస్తోందిని నిర్భంధాలు తప్పటంలేదని వెల్లడించారు.దాంట్లో భాగంగానే ప్రజలు రోజుకు మూడుసార్లు మాత్రమే బయటకు రావాలని సూచించారు.
అలాకాకుండా రూల్స్ బ్రేక్ చేస్తే..మూడు సార్లకు మించి డోర్ తెరిచి బయటకు వస్తే వారిని క్వారంటైన్ కేంద్రాలకు పంపిస్తాం అని తెలిపారు. ఏ అపార్ట్ మెంట్ లో అయినా కేసులు నిర్ధారణ జరిగితే ఆ అపార్ట్ మెంట్ ను మూడు వారాల పాటు సీల్ చేస్తాం అని తెలిపారు. కాగా..17 ప్రాంతాలలో 143 కొత్త కేసులు రికార్డయ్యాయని చైనా అధికారులు వెల్లడించారు. వీటిలో 35 కేసులు విదేశాల నుంచి వచ్చినవారిలో నిర్ధారణ కాగా..108 స్థానికంగా నమోదయ్యాయని తెలిపారు. ఇవేకాక నాన్‌జింగ్ సిటీలో మరో 48 కేసులు నమోదయ్యాయని వెల్లడించారు.