Chinese spy balloon
Chinese spy balloon: చైనాకు చెందిన స్పై బెలూన్ ను అమెరికా ఎట్టకేలకు కూల్చేసింది. అమెరికా గగనతలంలో ఆ బెలూన్ కలకలం రేపిన విషయం తెలిసిందే. మిలటరీ స్థావరాలపై అది నిఘా పెట్టింది. ఆ అతి పెద్ద బెలూన్ ను కూల్చితే ప్రజలకు ప్రమాదం తలెత్తే అవకాశం ఉందని భావించిన అమెరికా దాన్ని నిన్న, మొన్న నిశితంగా పరిశీలించింది. అది మోంటానా రాష్ట్ర గగనతలంలో కొన్ని రోజులుగా ఉంది.
చివరకు దాన్ని కొన్ని గంటల క్రితం ఆ బెలూన్ ను తమ దేశ యుద్ధ విమానాల సాయంతో సముద్రతలాల వైపునకు తీసుకొచ్చి పేల్చేసినట్లు అమెరికా రక్షణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. దీనిపై చైనా స్పందించింది. మానవరహిత బెలూన్ ను పేల్చివేయడం పట్ల నిరసన వ్యక్తం చేస్తున్నామని చైనా విదేశాంగ శాఖ చెప్పింది. కాగా, బెలూన్ ను పేల్చిన దృశ్యాలను అమెరికా వార్తా ఛానెళ్లు ప్రసారం చేశాయి.
ఎఫ్-22 యుద్ధ విమానాన్ని వాడి ఆ బెలూన్ ను పేల్చినట్లు వివరించాయి. దక్షిణ కాలిఫోర్నియా మర్టల్ బీచ్ ప్రాంతంలో ఆ బెలూన్ శకలాలు పడ్డాయి. వాటిని సేకరించేందుకు మిలటరీ సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. అమెరికా, చైనా మధ్య ప్రతికూల వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఈ బెలూన్ కలకలం రేపడం గమనార్హం.
తైవాన్ విషయంతో పాటు చైనాలో మానవ హక్కుల ఉల్లంఘన, దక్షిణ చైనా సముద్రం వంటి అంశాలపై ఇరు దేశాల మధ్య వివాదం కొనసాగుతోంది. చైనా బెలూన్ ను అమెరికా మిలటరీ విమానం నుంచి కూడా అధికారులు ముందుగా పరిశీలించారు. ఈ విషయాన్ని చైనా అధికారుల ముందు కూడా అమెరికా అధికారులు లేవనెత్తారు.
Vande Metro Services : వందే భారత్ తరహాలో.. త్వరలో దేశంలో వందే మెట్రో సర్వీసులు