Cine Hero Mla Balakrishnas Birthday Celebrations America 3638
సినీ హీరో, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ పుట్టిన రోజు వేడుకలు అమెరికాలో ఘనంగా జరిగాయి. బాలయ్య 60 వ బర్త్ డే వేడుకలను ఆయన అభిమానులు జరిపారు. బాలయ్య అభిమానులందరినీ ఏకం చేస్తూ ఎన్ ఆర్ ఐ కోమటి జయరాం చేసిన వినూత్న ప్రయత్నం సక్సెస్ అయింది. తమ అభిమాన హీరో 60వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా అమెరికాలోని బాలయ్య అభిమానులందరూ 60 నగరాల్లో 60 కేకులు కట్ చేసి వైవిధ్యపూరితంగా పుట్టిన రోజు సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. ఈ విధంగా బాలకృష్ణ పట్ల తమ అభిమానాన్ని చాటుకున్నారు.
ఈ సందర్భంగా కోమటి జయరాం మాట్లాడుతూ బే ఏరియాతో బాలయ్యకు ఎంతో అనుంబంధం ఉందన్నారు. ఇక్కడ గతంలో రెండు సార్లు అభిమానుల సమక్షంలో బాలకృష్ణ బర్త్ డే వేడుకలు జరుపుకున్నారని తెలిపారు. కరోనా వైరస్ సమయంలో అమెరికా ప్రభుత్వం విధించిన నిబంధనలను పాటిస్తూ బాలయ్య పుట్టిన రోజు వేడుకలను నిర్వహించడం ఒక కొత్త అనుభూతినిచ్చిందని తెలిపారు. చివరి నిమిషంలో సమాచారం ఇచ్చినా అభిమానులంతా ఏకమై ఆయా నగరాల్లో బాలయ్య పుట్టిన రోజు వేడుకలకు పెద్ద ఎత్తున హాజరవ్వడం అభినందనీయమన్నారు. బాలకృష్ణ బర్త్ డే వేడుకల్లో పాల్గొన్న అందరికీ కోమటి జయరాం అభినందనలు తెలిపారు.
Read: నిరాడంబరంగా బాలకృష్ణ బర్త్‌డే వేడుకలు