Vijay- Trisha: లండన్ లో చిల్ అవుతున్న సీఎం విజయ్- త్రిషా.. సోషల్ మీడియాను ఊపేస్తున్న పిక్స్
తమిళనాడు ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు విజయ్, త్రిషా (Vijay- Trisha)కలిసి రేస్‌ను తిలకిస్తున్న దృశ్యాలు నెట్టింట బాగా వైరల్ అయ్యాయి.
- V Santhosh Kumar
- Updated on- September 13, 2026 / 09:28 AM IST
Cm vijay and trisha krishnan london visit photos goes viral on social media
- లండన్‌లో విజయ్ విదేశీ పర్యటన
- త్రిషాతో కలిసి రేస్ తిలకింపు
- అజిత్‌తో ఆత్మీయ కౌగిలింత దృశ్యాలు
Vijay- Trisha: తమిళనాడు ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు విజయ్ బ్రిటన్‌లోని ప్రసిద్ధ సిల్వర్‌స్టోన్ రేసింగ్ ట్రాక్‌ను సందర్శించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు, చెన్నై సమీపంలో నిర్మించతలపెట్టిన ప్రతిష్టాత్మక ‘మోటార్ రేసింగ్ సిటీ’ కోసం అక్కడ క్రీడా మైదానాల ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ పర్యటనలో భాగంగా సిల్వర్‌స్టోన్‌లో జరిగిన మిషెలిన్ లే మాన్స్ కప్ కార్ల రేస్‌కు ప్రత్యేక అతిథిగా హాజరైన విజయ్, పచ్చజెండా ఊపి పోటీలను అధికారికంగా ప్రారంభించారు.
అజిత్, విజయ్ ఆత్మీయ కలయిక:
ఈ కార్ల రేస్‌లో తమిళ అగ్ర నటుడు అజిత్ కుమార్ తన సొంత జట్టు ‘అజిత్ రెడ్‌యాంట్ బై విరాజ్’ తరఫున ఎల్‌ఎంపీ3 ప్రో విభాగంలో పోటీపడ్డారు. రేస్ ట్రాక్ వద్ద అజిత్‌ను చూసిన విజయ్ ఎంతో ఆనందంతో ఆయన వద్దకు పరుగెత్తుకెళ్లి ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. కోలీవుడ్ అగ్ర నటులైన వీరిద్దరి ఆత్మీయ కలయికకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సెలబ్రిటీలు:
ఈ రేసింగ్ ఈవెంట్‌లో విజయ్‌తో పాటు ప్రముఖ నటి త్రిషా కృష్ణన్, మంత్రి ఆదవ్ అర్జున, నటి రాధికా శరత్‌కుమార్ కూడా పాల్గొన్నారు. ప్రేక్షకుల గ్యాలరీలో విజయ్, త్రిషా(Vijay- Trisha) కలిసి రేస్‌ను తిలకిస్తున్న దృశ్యాలు నెట్టింట బాగా వైరల్ అయ్యాయి. తమిళనాడులో క్రీడా మౌలిక వసతుల అభివృద్ధి లక్ష్యంగా సాగుతున్న సీఎం విజయ్ బ్రిటన్ పర్యటన అటు రాజకీయంగా, ఇటు సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.
