FASTag Portability Facility: వాహనదారులకు కేంద్రం బిగ్ ఆఫర్.. ఇకపై ‘ఫాస్టాగ్ పోర్టబులిటీ’ సేవలు.. పాత స్టిక్కర్ తీసే పనిలేదు!
కేంద్ర ప్రభత్వం ఫాస్టాగ్(FASTag Portability Facility) విధానంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చేపట్టింది.
Central Government has introduced the FASTag portability facility
- వాహనదారులకు కేంద్రం భారీ ఊరట
- అందుబాటులోకి ఫాస్టాగ్ పోర్టబులిటీ సేవలు
- ఒకే స్టిక్కర్‌తో బ్యాంక్ మార్పు
FASTag Portability Facility: దేశంలోని కోట్లాది మంది వాహనదారులకు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ భారీ ఊరట నిచ్చే శుభవార్త అందించారు. జాతీయ రహదారులపై టోల్ చెల్లింపుల కోసం ఉపయోగిస్తున్న ఫాస్టాగ్ విధానంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇప్పటివరకు వేరే బ్యాంకుకు మారాలంటే పాత ఫాస్టాగ్ తీసేసి కొత్త స్టిక్కర్ వేసుకోవాల్సి వచ్చేది, కానీ ఇకపై ఆ అవసరం లేకుండా ఒకే స్టిక్కర్‌తో నచ్చిన బ్యాంకుకు మారే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చారు.
‘ఫాస్టాగ్ వన్’ పోర్టబులిటీ సేవలు:
గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌లో కేంద్రం ప్రవేశపెట్టిన ‘ఫాస్టాగ్ వన్(FASTag Portability Facility)’ పోర్టబులిటీ విధానం ద్వారా పాత ఖాతాను క్లోజ్ చేయాల్సిన పని లేకుండానే వేరే బ్యాంకును ఎంచుకోవచ్చు. వాహనదారుడి ట్యాగ్ ఐడీ, రిజిస్ట్రేషన్ నెంబర్, విండ్‌స్క్రీన్ స్టిక్కర్ పాతవే కొనసాగుతాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI), IHMCL సంస్థలు సంయుక్తంగా ఈ ఆధునిక సాంకేతిక సేవలను అభివృద్ధి చేశాయి.
సులభంగా బ్యాంక్ మార్చుకునే విధానం:
వాహనదారులు ‘రాజ్ మార్గ్ యాత్ర’ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని అర్హత చెకింగ్, వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేసి నచ్చిన బ్యాంకును ఎంచుకోవచ్చు. పాత ఖాతాలోని బ్యాలెన్స్, పెండింగ్ లావాదేవీలు పూర్వపు బ్యాంకే చూసుకుంటుంది. స్టిక్కర్లు పదే పదే మార్చే శ్రమ తగ్గించి, టోల్ సేవలను మరింత వేగవంతం చేసేందుకు ఈ నిర్ణయం ఎంతగానో ఉపయోగపడనుంది.
