చనిపోయాక ఏం జరుగుతుంది?.. ఇదిగో ఈమె చూసిందట.. ఏం చెబుతుందో వినండి..
బ్రయానా లాఫర్టీ మైక్లోనస్ డైస్టోనియా అనే ప్రాణాంతకమైన న్యూరలాజికల్ వ్యాధితో బాధపడుతుంది. ఆమె ఎనిమిది నిమిషాల పాటు మెడికల్‌గా చనిపోయింది.

Brianna Lafferty
Brianna Lafferty: మనిషి పుట్టుక, మరణం సహజం, జన్మించిన వ్యక్తి మరణించక తప్పుదు. అయితే, మనిషి చనిపోయిన తరువాత ఏం జరుగుతుంది..? అనేది అంతుచిక్కని ప్రశ్న. దీని గురించి కొందరు శాస్త్రవేత్తలు కొన్నేళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. నియర్ డెత్ ఎక్స్ పీరియెన్సెస్ గురించి తెలుసుకోవటం కష్టమని వారు చెబుతున్నారు. అయితే, తాజాగా.. అమెరికాలోని కొలరాడోకు చెందిన 33ఏళ్ల బ్రయానా లాఫర్జీ అనే మహిళ చనిపోయిన తరువాత ఏం జరుగుతుందో చెప్పింది.
బ్రయానా లాఫర్టీ ఎనిమిది నిమిషాల పాటు క్లినికల్ మరణాన్ని పొందింది. ఆ సమయంలో తాను పొందిన అనుభవాలను ఆమె వివరించింది. చావు భ్రాంతి మాత్రమే అని.. ఆత్మకు చావు ఉండదని ఆ మహిళ పేర్కొంది.
బ్రయానా లాఫర్టీ మైక్లోనస్ డైస్టోనియా అనే ప్రాణాంతకమైన న్యూరలాజికల్ వ్యాధితో బాధపడుతుంది. ఆమె ఎనిమిది నిమిషాల పాటు మెడికల్ గా చనిపోయింది. తాను చనిపోయిన తరువాత ఏం జరిగిందనే విషయాలు చెప్పింది. ‘‘తాను చనిపోయిన తరువాత అంతా చీకటిగా కనిపించింది. కొద్దిసేపటి తరువాత తాను మరో లోకంలోకి ప్రవేశించాను. ఆ సమయంలో నేను క్లినికల్ గా చనిపోయినట్లు డాక్టర్లు డిక్లేర్ చేసినట్లు నాకు గుర్తుంది. కానీ, నేను మాత్రం స్పృహలోనే ఉన్నట్లు అనిపించింది. నా ఫిజికల్ బాడీ నుంచి నన్ను వేరుచేసినట్లు అనిపించింది. అయినప్పటికీ నేను బతికే ఉన్నానన్న అనుభూతి కలిగింది. చనిపోయేటప్పుడు నాకు ఎలాంటి నొప్పి, బాధ కలగలేదు. బదులుగా ఎంతో మన:శాంతి కలిగింది’’ అంటూ బ్రయానా లాఫర్టీ తెలిపింది.
దేహం నుంచి వేరుపడ్డాక నా శరీరంపై నుంచి ఆత్మ ఎగురుతూ వెళ్లిపోయింది. తరువాత నేను మరో ప్రపంచంలోకి ప్రవేశించాను. అక్కడ మనుషులుకాని జీవులను కలిశాను అంటూ బ్రయానా వివరించింది. అక్కడ సమయం లేదు. అయితే, ప్రతిదీ చాలా సందర్భోచితంగా ఉంది. మనుషులుగా మన అనుభవాలు ఎంత తాత్కాలికమో నాకు అనిపిస్తుంది అని బ్రియానా చెప్పింది. మరణం తరువాత ఆలోచనలు పూర్తిగా మారుతాయని చెప్పింది.
ఆమె చెప్పిన ప్రకారం.. మళ్లీ లోకానికి తిరిగి వచ్చిన తరువాత ఆమె చాలా సమస్యలను ఎదుర్కొంది. నడవడం, మాట్లాడటం కూడా కష్టం అనిపించింది. పిట్యూటరీ గ్రంథిలో సమస్య కారణంగా ఆమె మెదడు శస్త్రచికిత్స కూడా చేయించుకోవలసి వచ్చింది. నేను ఎందుకు అనారోగ్యానికి గురయ్యానో ఇప్పుడు అర్ధమవుతుంది. ఏది జరిగినా ఏదో ఒక ప్రయోజనం కోసం జరుగుతుందని ఆమె చెప్పింది.