Belgium Riots: మొరాకో చేతిలో ఓటమిని జీర్ణించుకోలేక.. స్వదేశంలో అభిమానుల ఆందోళన.. కార్లు, స్కూటర్లు దగ్దం..

వందల సంఖ్యలో ఫుట్‌బాల్ అభిమానులు బెల్జియన్ రాజధానితో పాటు అనేక ప్రాంతాల్లో రోడ్లపైకొచ్చి తమ నిరసనను తెలిపారు. ఈ నిరసన‌కాస్త ఉధ్రిక్తతకు దారితీసింది. కొంతమంది ఆందోళన కారులు కార్లు, ఎలక్ట్రిక్ స్కూటర్లకు నిప్పుపెట్టారు.

Belgium Riots: ఫిఫా ప్రపంచకప్‌లో ఆదివారం మొరాకో వర్సెస్ బెల్జియం మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో బెల్జియ జట్టుకు మొరాకో గట్టి షాకిచ్చింది. మొరాకో చేతిలో 2-0 గోల్స్ తేడాతో బెల్జియం చిత్తుగా ఓడిపోయింది. ఓటమిని జీర్ణించుకోని సాకర్ అభిమానులు బెల్జియంలోని రోడ్లపైకొచ్చి ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలో ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి.

Belgium Riots

వందల సంఖ్యలో ఫుట్‌బాల్ అభిమానులు బెల్జియన్ రాజధానితో పాటు అనేక ప్రాంతాల్లో రోడ్లపైకొచ్చి తమ నిరసనను తెలిపారు. ఈ నిరసన‌కాస్త ఉధ్రిక్తతకు దారితీసింది. కొంతమంది ఆందోళన కారులు కార్లు, ఎలక్ట్రిక్ స్కూటర్లకు నిప్పుపెట్టారు. పరిస్థితి తీవ్రరూపం దాల్చడంతో పోలీసులు రంగంలోకి దిగి నీటి ఫిరంగులు, టియర్ గ్యాస్ ఆందోళనకారులపై ప్రయోగించి వారిని చెదరగొట్టారు. ఈ ఆందోళనలో పాల్గొన్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

బెల్జియంపై మొరాకో విజయంతో బెల్జియం, డచ్ లోని పలు నగరాల్లో మొరాకో వలసదారులు సంబరాలు చేసుకున్నారు. ఈ కారణంగా కొందరు అల్లర్లకు పాల్పడినట్లు తెలిసింది. ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి అదుపులో ఉందని, హింసాత్మక ఘర్షణలు జరిగిన ప్రాంతాల్లో ముందుజాగ్రత్తగా పోలీసు పెట్రోలింగ్ కొనసాగుతోందని పోలీసు అధికార ప్రతినిధి ఇల్సే వాన్ డి కీరే తెలిపారు. నిరసనల కారణంగా.. మెట్రో, ట్రామ్ సేవలు మూసివేయబడ్డాయి. నిరసనలు జరగకుండా ఉండేందుకు మెట్రో స్టేషన్ల గేట్లను మూసివేసి వీధుల్లో పోలీసుల పెట్రోలింగ్‌ను పెంచారు.

ట్రెండింగ్ వార్తలు