లాక్‌డౌన్‌లో మూసిన రెస్టారెంట్‌లోకి చొరబడ్డాడు..తింటూ, తాగుతూ 4 రోజులు అక్కడే….

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. పెద్ద సంఖ్యలో కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. దీంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. కరోనా

  • Publish Date - April 20, 2020 / 05:35 AM IST

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. పెద్ద సంఖ్యలో కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. దీంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. కరోనా

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. పెద్ద సంఖ్యలో కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. దీంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. కరోనా కట్టడికి లాక్ డౌన్ అమలు చేస్తోంది. లాక్ డౌన్ అంటే ప్రజలు ఇళ్లలోనే ఉండాలి. అన్ని రకాల షాపులు, ఆఫీసుల, రెస్టారెంట్లు మూతపడ్డాయి. అయితే కనెక్టికట్ లోని న్యూ హెవెన్ లో ఓ వ్యక్తి లాక్ డౌన్ ను తట్టుకోలేకపోయాడు. మద్యానికి బానిస అయిన అతడు మందు దొరక్క పిచ్చోడయ్యాడు. మందు చుక్క కోసం విలవిలలాడాడు.

మరో దారి లేకపోవడంతో అతడు మూసి ఉన్న రెస్టారెంట్ ను బద్దలు కొట్టాడు. అందులోకి చొరబడ్డాడు. నాలుగు రోజులు లోపలే ఉన్నాడు. రెస్టారెంట్ లో ఉన్న తిండి తిన్నాడు. ఫుల్లుగా మద్యం తాగాడు. అక్కడే నిద్రపోయాడు. అలా 4 రోజులు ఎంజాయ్ చేశాడు. చివరికి ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

బాగా తాని, తాగిన ఆ వ్యక్తి నిద్రలోకి జారుకున్నాడు. పోలీసులు ఆ రెస్టారెంట్ లోకి వెళ్లి చూడగా అతడు కనిపించడంతో షాక్ తిన్నారు. ఆ సమయంలో ఆ వ్యక్తి ఫుల్లుగా నిద్రపోతున్నాడు. అతడి చేతిలో మద్యం బాటిల్ ఉంది. ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. పోలీసులు రెస్టారెంట్ లోని సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించారు. అతడు తలుపులు బద్దలు కొట్టి లోనికి చొరబడటం అందులో ఉంది. ఆహారం తిన్నాడు. మద్యం సేవించాడు. బీర్ తాగాడు. అంతేకాదు 70 మద్యం బాటిళ్లు చోరీ కూడా చేసినట్టు గుర్తించారు పోలీసులు. సోల్ డీ క్యూబా కేఫ్ లో ఈ ఘటన జరిగింది. దుండగుడిని లూయిస్ ఏంజిల్ గా(42) పోలీసులు గుర్తించారు. అతడిపై చోరీ నేరం కింద క్రిమినల్ కేసు నమోదు చేశారు.

దీనిపై రెస్టారెంట్ యాజమాన్యం స్పందించింది. తమకు భారీగా ఆహారం, మద్యం నష్టం జరిగినట్టు తెలిపింది. వేల డాలర్ల నష్టం జరిగినట్టు పోలీసులకు తెలిపింది. కాగా, లాక్ డౌన్ నేపథ్యంలో ఈ ఘటన జరగడంతో స్థానిక వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. చోరీలు జరక్కుండా తమ షాపులకు భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తమ రెస్టారెంట్ల దగ్గర బందోబస్తు పెంచాలన్నారు.

Also Read | కరోనా టెస్ట్ లలో మాదే రికార్డు…ఇక అంతా సేఫ్ : ట్రంప్