Male contraceptive pills: పురుషులకు గర్భ నిరోధక మాత్రలు..త్వరలోనే అందుబాటులోకి

ఇప్పటివరకు మహిళలకు మాత్రమే అందుబాటులో ఉన్న గర్భనిరోధక మాత్రలు త్వరలో పురుషులకు కూడా అందుబాటులోకి రానున్నాయి.

Male Contraceptive Pill Is 99% Effective, Show Tests In Mice Contraceptive Pill For Men Is 99 Effective In Preventing Pregnancy

Male contraceptive pill : గర్భనిరోధక మాత్రలు మహిళలకే కాదు పురుషులకు కూడా త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ఈ మాత్రల విషయంలో పరిశోధకులు ఇప్పటికే మగ ఎలుకలపై ప్రయోగాలు చేయగా విజయవంతమైన ఫలితాలు వచ్చాయి. దీంతో ఇవి మనుషులకు కూడా ఉపయోగపడనున్నాయి. గర్భనిరోధక మాత్రంలు ఎలుకలపై జరిపిన ప్రయోగాలు విజయవంతం అయ్యాయి అని అమెరికాలోని మిన్నెసొటా వర్సిటీ శాస్త్రవేత్తలు ప్రకటించారు.

తాము మగ ఎలుకలపై పరీక్షించిన ఔషధం 99% ప్రభావవంతంగా పనిచేసాయి అని తెలిపారు. ఇది పురుష హార్మోన్లపై ఎటువంటి దుష్ప్రభావం చూపలేదని వెల్లడించారు. తమ పరిశోధనల్లో భాగంగా శాస్త్రవేత్తలు వైసీటీ529 అనే ఔషధాన్ని నాలుగు వారాల పాటు ఎలుకలకు ఇచ్చి వాటిని నిరంతరం పర్యవేక్షించారు. దీంట్లో భాగంగా ఎలుకల్లో వీర్య కణాల వృద్ధి గణనీయంగా తగ్గింది అని గుర్తించారు. డోసును నిలిపివేసిన 4-6 వారాల తర్వాత మళ్లీ యథావిధిగా ఉత్పత్తి అయ్యాయి.