కరోనా కల్లోలం : 15 వేల మంది చనిపోయారు!

  • Publish Date - March 24, 2020 / 12:40 AM IST

కరోనా విజృంభిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది మృతి చెందుతున్నారు. ఈ మహమ్మారిన ప్రారదోలడానికి అటు వ్యైద్యులు, ప్రభుత్వాలు, ఇలా ఎంతో మంది కృషి చేస్తున్నారు. చైనా నుంచి వచ్చిన ఈ వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇప్పటి వరకు 15 వేల 189 మంది చనిపోయారని అంచనా వేస్తున్నారు. ఇందులో యూరప్ కి చెందిన వారు అధికంగా ఉన్నారు. 9 వేల 197 మంది చనిపోయారు.

స్పెయిన్ లో కూడా ఈ మహమ్మారీ తీవ్రంగా ప్రబలింది. గత 24 గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా వేయి 395 మంది బలైపోయారు. ఇందులో 462 మంది స్పెయిన్ దేశస్తులున్నారు. గత 24 గంటల్లో 462 మంది చనిపోయారని తెలుస్తోంది. మొత్తంగా స్పెయిన్ దేశంలోమృతు సంఖ్య 2 వేల 182కి చేరిందని అక్కడి వైద్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇటలి (5 వేల 476), చైనా (3,270), స్పెయిన్ (2,182) కరోనా మరణాలున్నాయి. 

See Also | చైనా క‌న్నా ముందే ఇట‌లీలో క‌రోనా విజృంభ‌ణ‌