Mixed Vaccine : సత్ఫలితాలనిస్తున్న మిక్సింగ్ వ్యాక్సిన్

మిక్సింగ్ టీకాలు ఇవ్వడం వలన మంచి సత్ఫలితాలు వస్తున్నాయని తేల్చారు స్వీడన్ పరిశోధకులు. దేశ వ్యాప్తంగా పరిశోధనలు చేసిన వీరు భిన్న టీకాలు సత్పలితాలు ఇస్తున్నాయని పేర్కొన్నారు

Mixed Vaccine : ప్రపంచ వ్యాప్తంగా టీకా డ్రైవ్ శరవేగంగా సాగుతుంది. ఇప్పటికే చాలా దేశాలు 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేశాయి. ఇక కొన్ని దేశాలు 100 శాతానికి చేరువలో ఉన్నాయి. ఇదిలా ఉంటే మిక్సింగ్ వ్యాక్సిన్స్‌పై ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఏదైనా రెండు భిన్న వ్యాక్సిన్లను ఇస్తే.. ఎటువంటి మార్పులు చోటుచేసుకుంటాయనే దానిపై రీసర్చ్ జరుగుతుంది. ఇప్పటికే కొన్ని పరిశోధనల ఫలితాలు వచ్చాయి. మిక్సింగ్ డోస్‌ల వలన సత్పలితాలు వస్తున్నట్లు ఈ పరిశోధనల్లో తెలిసింది.

చదవండి : Coronavirus Update: కరోనా నుంచి తప్పించుకున్నట్లేనా? భారీగా తగ్గిన కేసులు.. ఎప్పుడు మాస్క్‌లు లేకుండా తిరగొచ్చు?

మిక్సింగ్ టీకాలు ఇవ్వడం వలన మంచి సత్ఫలితాలు వస్తున్నాయని తేల్చారు స్వీడన్ పరిశోధకులు. దేశ వ్యాప్తంగా పరిశోధనలు చేసిన వీరు ఇండియన్ వ్యాక్సిన్ కోవిషిల్డ్ మొదటి డోస్, ఫైజర్‌ను రెండవ డోస్‌గా తీసుకున్న వారికి కరోనా వైరస్ నుంచి ఎక్కువ రక్షణ లభిస్తున్నదని తేల్చారు. ఈ అధ్యయనం వివరాలు లాన్సెట్‌ జర్నల్‌లో ప్రచురితమైంది. శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో భాగంగా.. ఒకే రకమైన టీకా వేసుకొన్నవారిలో ఇమ్యూనిటీ, రెండు భిన్న రకాల వ్యాక్సిన్లు వేసుకొన్నవారిలో ఇమ్యూనిటీని రెండున్నర నెలల పాటు గమనించారు.

చదవండి : Corona Cases : కరోనా బులిటెన్ విడుదల చేసిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ

ట్రెండింగ్ వార్తలు