2019లోనే చాలా దేశాల్లో కరోనా కేసులు…చైనా

Coronavirus in various parts of world last year ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్ చైనాలోని వైహాన్ సిటిలోనే పుట్టిందనే వాదనలను చైనా కొట్టిపడేసింది. 2019లోనే ప్రపంచంలోని వివిధ దేశాల్లో కరోనా వెలుగులోకి వచ్చిందని…మొదటిగా చైనానే దానిని రిపోర్ట్ చేసినట్లు డ్రాగన్ కంట్రీ చెబుతోంది.


శుక్రవారం చైనా విదేశాంగమంత్రిత్వశాఖ ప్రతినిధి హువా చున్యింగ్ మీడియాతో మాట్లాడుతూ…వూహాన్ లోని ఓ బయో ల్యాబ్ నుంచే కరోనా బయటకు వచ్చిందని అమెరికా చేస్తున్న ఆరోపణలు అవాస్తవం. వూహాన్ లోని జంతు మార్కెట్ లోని గబ్బిలాలు, పాంగోలిన్ ల ద్వారా కరోనా వచ్చిందనేది అవాస్తవమని తెలిపారు. . 2019లోనే ప్రపంచంలోని వివిధ దేశాల్లో కరోనా వెలుగులోకి వచ్చింది. చైనా మెదటగా రిపోర్ట్ చేసింది అంతే. పాథోజన్ ను గుర్తించి జోనోమ్ సీక్వెన్స్ ను ప్రపంచంతో షేర్ చేసింది.

చైనా కమ్యూనిస్ట్ పార్టీ కప్పిపుచ్చడం వల్లే కరోనా వైరస్ సంక్షోభం అనంతంగా పెరిగిపోయిందంటూ అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపీ ఇటీవల ఆరోపణలు చేసిన నేపథ్యంలో ప్రతిస్పందంగా హువా ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రాణాంతక కరోనావైరస్ యొక్క మూలాన్ని పరిశోధించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సన్నద్ధమవుతున్న తరుణంలో చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ ప్రకటన చేసింది.


ఈ ఏడాది మే నెలలో ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీ (WHA) యొక్క వార్షిక సమావేశంలో WHO యొక్క నిర్ణయాత్మక బాడీ కరోనా వైరస్ యొక్క మూలాన్ని పరిశోధించడానికి ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. చైనా కూడా ఈ తీర్మానానికి మద్దతు ఇచ్చింది.

ఆగస్టులో, డబ్ల్యూహెచ్‌ఓకు చెందిన ఇద్దరు సభ్యుల బృందం చైనాను సందర్శించి కోవిడ్ -19 యొక్క జంతు వనరులు మరియు జలాశయాలపై దర్యాప్తులో భాగంగా గ్రౌండ్ వర్క్ పూర్తి చేశారు.


కాగా, చైనా ఎంత బుకాయిస్తున్నప్పటికీ మొదటి కరోనా కేసు చైనాలోనే వచ్చిందని అందరికీ తెలిసిన విషయమే. కరోనా కేసులు పెరుగుతుంటంతో ప్రపంచంలోనే మొదటిసారిగా జనవరి 23 న వుహాన్‌ సిటీలో లాక్ డౌన్ విధించింది చైనా. అప్పటివరకు చైనా బయట కేవలం తొమ్మిది కరోనా కేసులు మాత్రమే ఉన్నాయి. అందులో ఒక పాజిటివ్ కేసు అమెరికాలో నమోదైంది. ఇప్పుడు అమెరికాలో 7.5 మిలియన్ల కేసులు మరియు 2.10 లక్షల మరణాలను నమోదయ్యాయి. భారత్ లో కూడా కరోనా కేసుల సంఖ్య 70లక్షలకు చేరుకుంది.