కరోనా గురించి తెలిసి బయటకు వెళ్లడానికి భయపడుతుంటే ఈ పెద్దాయన కొత్త టెక్నిక్‌తో చక్కగా తిరిగేస్తున్నాడు. షాపింగ్ కోసం మార్కెట్‌కు వచ్చిన వ్యక్తి వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా అయింది. ప్రస్తుతం లక్షా 38వేల కరోనా కేసులు నమోదుకాగా, 4వేల 900మంది ప్రాణాలు కోల్పోయారు.
కరోనా నుంచి తమను తాము కాపాడుకోవాలంటే ఫిజికల్ కాంటాక్ట్, పర్సనల్ స్పేస్ మెయింటైన్ చేయడం, హగ్స్, షేక్ హ్యాండ్స్ పూర్తిగా మానెయ్యాలని చెబుతున్నారు. ఈ క్రమంలో ఇటలీకి చెందిన వ్యక్తి.. ఒక మీటర్ రేడియస్‌తో ఉన్న డిస్క్ ధరించి మార్కెట్ లో తిరుగుతుంటే నోరెళ్ల బెట్టి చూడడంతో పాటు ఆశ్చర్యపోవడం వంతు అయిందందరికీ.
Roma, mercato testaccio.#coronavirus #coronavirusitalia #11Marzo #iorestoacasa #restoacasa #chiuderetutto #COVID19 #roma #testaccio pic.twitter.com/wJBSf66Kyu
— L'Antikulturale (@Antikulturale) March 11, 2020
12సెకన్ల పాటు ఉన్న వీడియోకు సోషల్ మీడియాలో ఫుల్‌గా చక్కర్లు కొడుతుంది. అతని చుట్టూ ఉన్న పసుపు రంగు డిస్క్ మనిషిని దగ్గరకు రానీయకుండా చూస్తుంది. ఇటలీలో ఇప్పటికే వెయ్యికి పైగా కరోనా మరోణాలు నమోదయ్యాయి. భారత్‌లో 83కేసులు నమోదుకాగా, ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.