God’s influencer: 15 ఏళ్ల వయసులో మరణించిన బాలుడికి సెయింట్ హోదా
కార్లో అక్యూటిస్ 15 ఏళ్ల వయసులోనే కాథలిక్ బోధనలు వ్యాప్తి చేయడానికి బహుభాషా వెబ్‌సైట్లు రూపొందించారు. అందుకే అతనికి “దేవుని ఇన్‌ఫ్లూయెన్సర్” అనే బిరుదు వచ్చింది.

computer whiz Carlo Acutis
Carlo Acutis: లండన్‌లో జన్మించిన ఇటాలియన్ వ్యక్తి, కంప్యూటర్ మేధావి కార్లోస్ ఆక్యూటిస్‌కు సెయింట్ హోదా దక్కింది. కార్లోస్ 2006లో 15 ఏళ్ల వయసులోనే లుకేమియాతో మరణించారు. ఇప్పుడు అతనిని కాథలిక్ చర్చ్ తొలి మిలీనియల్ సెయింట్‌గా సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో ప్రకటించారు.
కార్లో అక్యూటిస్ 15 ఏళ్ల వయసులోనే కాథలిక్ బోధనలు వ్యాప్తి చేయడానికి బహుభాషా వెబ్‌సైట్లు రూపొందించారు. అందుకే అతనికి “దేవుని ఇన్‌ఫ్లూయెన్సర్” అనే బిరుదు వచ్చింది.
కార్లోస్ ఆక్యూటిస్‌తో పాటు ఇటలీకి చెందిన పయర్ గియోర్జియో ఫ్రాసాటీకి కూడా సెయింట్ హోదా లభించింది. వారు ఇద్దరూ దైవసేవకు అంకితం అయ్యారని పోప్ లియో కొనియాడారు. పోప్ లియో హయాంలో సెయింట్ హోదాను ఇవ్వడం ఇదే మొదటిసారి.
ఆదివారం సెయింట్ పీటర్స్ స్క్వేర్ ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన లక్షలాది మందితో నిండిపోయింది. వారిలో అనేకమంది ఇటాలియన్‌లు, అమెరికన్‌లే. అక్యూటిస్ కుటుంబం కూడా అక్కడే ఉంది.
ఈ సందర్భంగా లియో ప్రసంగం ఇచ్చారు. ఆక్యూటిస్, పయర్ గియోర్జియో ఫ్రాసాటీ తమ జీవితాలను దేవునికి అంకితం చేశారని చెప్పారు. ఈ కొత్త సెయింట్‌లు మనందరికీ, ముఖ్యంగా యువతకు స్ఫూర్తి అని చెప్పారు. జీవితాన్ని వృథా చేయకూడదని అన్నారు. ఈ వేడుకలు ఈ ఏడాది ప్రారంభంలో జరగాల్సి ఉన్నా, పోప్ ఫ్రాన్సిస్ మరణంతో వాయిదా పడ్డాయి.
కార్లో అక్యూటిస్ 1991 మే 3న లండన్‌లో జన్మించారు. తరువాత మిలాన్‌కి వెళ్లిన అతడి కుటుంబం అక్కడే నివసించింది. చిన్న వయసులోనే కంప్యూటర్ సైన్స్‌పై ఆసక్తి చూపారు కార్లో. ప్రోగ్రామింగ్ పుస్తకాలు చదివారు. కాథలిక్ సంస్థలకు వెబ్‌సైట్లు చేసిచ్చారు. “సైబర్ అపోస్టల్” అనే పేరు సంపాదించారు. 2006 అక్టోబరులో 15 ఏళ్ల వయసులోనే అక్యూటిస్ అక్యూట్ లుకేమియాతో బాధపడ్డారు. కొన్ని రోజుల్లోనే మరణించారు.