China’s Sinopharm is 86% effective : చైనా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్లలో ఒకటైన Sinopharm కరోనా వ్యాక్సిన్ 86 శాతం ప్రభావవంతంగా పనిచేస్తుందని యూఏఈ అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు. సినోఫారమ్ తయారు చేసిన ఈ వ్యాక్సిన్‌కు యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి ఆమోదం లభించింది.
వ్యాక్సిన్ షాట్లపై రివ్యూలో 86 శాతం వ్యాక్సిన్ సమర్థవంతమని తేలింది. దాంతో Sinopharm వ్యాక్సిన్ సాధారణ వినియోగానికి ప్రభుత్వం నుంచి మొదటిసారి ఆమోదం లభించింది. ఈ ప్రకటనతో చైనాకు బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి.
ఇప్పటికే సినోఫారమ్ వ్యాక్సిన్ కు అత్యవసర వినియోగానికి అనుమతి ఉంది. ఇప్పటికే మారొక్కో సహా పలు ఇతర దేశాలు సినోఫారమ్ వ్యాక్సిన్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నాయి. ఇదివరకే మోడర్నా వ్యాక్సిన్ 94.5 శాతం ప్రభావవంతమని రుజువైంది.
సినోఫారమ్ వ్యాక్సిన్ 86శాతం ప్రభావవంతమైన రేటుతో తర్వాతి స్థానంలో నిలిచింది. కానీ, ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ (70శాతం) కంటే ముందు వరుసలో నిలిచింది. కానీ, చైనా సిఫారమ్ వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్ ఫలితాలు ఇంకా వెల్లడి కాలేదు. యూఏఈ అధికారులు దీనికి సంబంధించి వివరాలను బహిర్గతం చేయగా.. సినోఫారమ్ దీనిపై ఇంకా స్పందించలేదు.