Golf Course : ఛీ..ఛీ.. మీ కక్కుర్తి పాడుగాను.. ఎక్కడా ప్లేస్ లేనట్లు బంకర్‌లో ఇదేం పాడుపని, వీడియో వైరల్

Romance In Golf Course Bunker : ఆ ప్రేమజంట చేసిన పని నెటిజన్లను షాక్ కి గురి చేసింది. ఛీ..ఛీ.. ఇదేం పాడుపని? అని మండిపడుతున్నారు. ప్లేస్ ఏంటో కూడా చూసుకోకుండా ఇలా రొమాన్స్ చేయడం ఏంటి?

గుట్టలు, పొదలు, పార్కులు.. ఇవన్నీ బోర్ కొట్టేశాయో ఏమో.. ఓ ప్రేమజంట ఏకంగా గోల్ఫ్ కోర్స్ లోని బంకర్ ను ఎంచుకుంది. సడెన్ గా మూడ్ వచ్చిందో, లేక ప్లాన్ ప్రకారమే అక్కడికి వెళ్లారో కానీ.. బంకర్ కనిపించగానే మైమరిచిపోయారు. రొమాన్స్ లో మునిగిపోయారు. అసభ్యకరమైన భంగిమలో కనిపించారు. బంకర్ ఏంటి? సెక్స్ చేసుకోవడం ఏంటి? అని షాక్ అవుతున్నారా? ఈ ఘటన బ్రిటన్ లోని ప్రముఖ గోల్ఫ్ కోర్స్ లో చోటు చేసుకుంది.

అది సెయింట్ ఆండ్రూస్ లోని గోల్ఫ్ కోర్స్. అక్కడ ఓ బంకర్ లో ప్రేమ జంట శృంగారంలో మునిగితేలింది. దీన్ని అటుగా వెళ్తున్న వ్యక్తి ఎవరో వీడియో తీశాడు. వీడియో తీసినోడు గమ్మునుండక సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. ఇక అంతే, ఈ వీడియో కాస్తా వైరల్ గా మారింది.

Also Read : షాకింగ్.. పోర్న్ వీడియో చేస్తూ అడ్డంగా దొరికిపోయిన ముగ్గురు యాక్టర్లు

ఈ ప్రేమజంట చేసిన పని నెటిజన్లను షాక్ కి గురి చేసింది. ఛీ..ఛీ.. ఇదేం పాడుపని? అని మండిపడుతున్నారు. ప్లేస్ ఏంటో కూడా చూసుకోకుండా ఇలా రొమాన్స్ చేయడం ఏంటి? మరీ ఇంత కక్కుర్తా? మీ కక్కుర్తి తగలెయ్య అని తిట్టిపోస్తున్నారు. నాలుగు గోడల మధ్యన బెడ్ రూమ్ లో ఎవరికీ కనిపించకుండా చేసుకోవాల్సిన పనిని ఇలా పబ్లిక్ ప్లేస్ లో చేసుకోవడం కరెక్ట్ కాదంటున్నారు. ఎక్కడ చేయాల్సిన పనిని అక్కడే చేయాలి, మరీ ఇంతలా దిగజారిపోతే నవ్వుల పాలు కాక తప్పందంటున్నారు.

Also Read : షాకింగ్ వీడియో.. లైవ్‌లో యాంకర్ దారుణ హత్య, గన్‌తో కాల్చి చంపిన దుండగుడు

మరికొందరు చాలా ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో వారి తప్పేమీ లేదు. మూడ్ వచ్చింది అంతే రొమాన్స్ లో మునిగిపోయారు అని సమర్థించారు. బంకర్ చాలా లోతుగా ఉంది. లోపల ఏం చేసుకున్నా బయటికి కనిపించదని అనుకున్నారేమో అని మరొకరు కామెంట్ చేశారు. వాళ్లు ఏదో డిఫరెంట్ గా ఉండాలని ట్రై చేశారు. అందుకే ఇలా బంకర్ ఎంచుకున్నారు అని ఇంకొకరు అన్నారు. రొటీన్ కు భిన్నంగా ఇలా శృంగారంలో పాల్గొన్నారు. చాలామందికి తెలుసు.. ఇలాంటి పనులకు బంకర్ చాలా బెస్ట్ స్పాట్ అని.. ఇలా నెటిజన్లు ఎవరికి తోచిన విధంగా వారు కామెంట్స్ పెడుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు