Covid-19: మళ్లీ విస్తరిస్తున్న కరోనా.. ప్రభుత్వాలు అప్రమత్తం!

ప్రపంచవ్యాప్తంగా ప్రభావం కాస్త తగ్గింది అనుకునేలోపే.. మళ్లీ పంజా విసురుతోంది కరోనా మహమ్మారి.

Covid-19: ప్రపంచవ్యాప్తంగా ప్రభావం కాస్త తగ్గింది అనుకునేలోపే.. మళ్లీ పంజా విసురుతోంది కరోనా మహమ్మారి. ఇప్పటికే పలు దేశాల్లో కేసులు విపరీతంగా పెరిగిపోగా.. బ్రిటన్‌, రష్యా, ఉక్రెయిన్‌, రుమేనియా దేశాల్లో కొవిడ్‌ తీవ్రత కలవరపెడుతోంది. చైనాలోనూ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. బ్రిటన్‌లో కూడా 50వేల కేసులు కొత్తగా రావడంతో.. ఆ దేశంలో ఆంక్షల విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది ప్రభుత్వం.

ప్రజలకు పూర్తిస్థాయిలో వ్యాక్సిన్లు అందకపోవడమే ఇందుకు కారణమని కూడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కరోనా కొత్త వేరియంట్ వ్యాప్తి తీవ్రంగా ఉండడంతో రష్యాలో కొత్తగా 37వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. కొత్త వేరియంట్ కారణంగా మరణాలు కూడా ఎక్కువగానే ఉన్నట్లు రష్యా అభిప్రాయపడుతోంది. అయితే, వెంటనే రంగంలోకి దిగిన ప్రభుత్వం కొవిడ్‌ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ఆదేశించింది.

వైరస్‌ తీవ్రత అధికంగా ఉన్నచోట లాక్‌డౌన్‌ అమలుచేసే అవకాశం కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా ఆఫీసులను కూడా మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మాస్కోలో 28వ తేదీ నుంచి లాక్‌డౌన్‌ అమల్లోకి రానుంది. ఫైజర్‌, మోడెర్నా, ఆస్ట్రాజెనికా, సినోవాక్‌ వ్యాక్సిన్లు కేవలం 15% మంది మాత్రమే పూర్తిస్థాయిలో వ్యాక్సిన్‌ తీసుకున్నారు.

కరోనా మహమ్మారి పుట్టినిల్లు చైనా కూడా మరోసారి భయం గుప్పెట్లోకి వెళ్లిపోయింది. కేసులు విపరీతంగా నమోదవుతున్నట్లు చెబుతున్నారు. దేశంలో కరోనా కేసులు వెలుగులోకి వచ్చిన వెంటనే పర్యాటక ప్రాంతాలను మూసివేసి, విమాన సర్వీసులను నిలిపివేశారు అధికారులు.

ట్రెండింగ్ వార్తలు