కోవిడ్ ట్రీట్మెంట్‌లో మందుగా Painkiller Ibuprofen ట్యాబ్లెెట్లు

  • Publish Date - June 3, 2020 / 01:03 PM IST

లండన్‌లోని గైస్ అండ్ సెయింట్ థామస్ హాస్పిటల్, కింగ్స్ కాలేజీ సంయుక్తంగా వినూత్న ప్రయోగానికి తెరలేపారు. పెయిన్ కిల్లర్, ఇన్‌ఫ్లెమ్మెటరీ మెడికేషన్ అయిన బ్రూఫిన్ ను COVID-19నివారణకు వాడితే ఎంతవరకూ పనిచేస్తుందా అని ప్రయోగిస్తారు. వెంటిలేటర్లు లేకుండా తక్కువ ఖర్చుతో కరోనాను నివారించడంపై సైంటిస్టులు పరిశోధనలు చేస్తున్నారు. 

ఈ ట్రయల్ ను లిబరేట్ అంటారు. ముందుగా దీనిని జంతువులపై ప్రయోగించి సిండ్రోమ్ చెదరగొట్టి శ్వాస సంబంధిత సమస్యలు నిరోధించే పనితీరును పరీక్షిస్తారు. ఈ ట్రయల్ లో 230మంది పేషెంట్లు పాల్గొనబోతున్నారు. ఈ డ్రగ్ కొవిడ్ నియంత్రణకు ఉపయోగపడుతుందని అంటే అన్నీ ఫార్మసీల్లో దొరుకుతుంది కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు. 

ప్రొఫెసర్ మితుల్ మెహతా.. రీసెర్చ్ టీం మెంబర్.. ఈ ట్రయల్ హాస్పిటల్ లో అడ్మిట్ అయి ఓమాదిరిగా తట్టుకోగల పేషెంట్ల మీదనే ప్రయోగిస్తారు. క్రిటికల్ స్టేజిలో ఉన్నవారి మీద కాదని చెప్పారు. యూకేలో మహమ్మారి ప్రభావం చూపిస్తున్న సమయంలో ఆరోగ్య నిపుణులు చాలా విషయాలు గమనించారు. 

ఆ సమయంలో ఈ  ibuprofen ట్రీట్‌మెంట్‌లో ఉపయోగించడంతో మెరుగైన ఫలితాలే వచ్చాయని చెప్పారు. యూకేలో ఇప్పటి వరకూ 2లక్షల 79వేల 392కేసులు నమోదుకాగా, 39వేల 452మంది మృతి చెందినట్లు తెలిపారు. కరోనా ధాటికి ప్రపంచంలోనే అత్యంత దారుణంగా నష్టపోయిన దేశం యూకేనే. అక్కడ కూడా మార్చిలో ప్రకటించిన లాక్‌డౌన్‌ను క్రమంగా సడలిస్తూ వస్తున్నారు.