కొవిడ్-19 వ్యాక్సిన్ వచ్చినా.. దీర్ఘకాలం ఇమ్యూనిటీ ఇవ్వకపోవచ్చు : ఆరోగ్య నిపుణులు 

  • Publish Date - June 6, 2020 / 11:16 AM IST

ప్రపంచమంతా కరోనా వైరస్ వ్యాక్సిన్ కోసం ఆశగా ఎదురుచూస్తోంది. కరోనాను నివారించాలంటే వ్యాక్సిన్ తప్ప మరో మార్గం లేదని గట్టిగా నమ్ముతోంది. కానీ, కరోనా వ్యాక్సిన్ కూడా దీర్ఘకాలం పాటు కరోనా నుంచి రక్షించలేదని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా పరిశోధనలు కొనసాగుతున్నాయి. కొన్ని ట్రయల్స్ దశకు చేరుకున్నాయి. కొన్నింట్లో వ్యాక్సిన్ టెస్టుల్లో సమర్థవంతమైన ఫలితాలు వచ్చాయని అంటుంటే.. మరోవైపు ఇతర కరోనా వ్యాక్సిన్లపై టెస్టింగ్ చేయనే లేదు.

ఏది ఏమైనాప్పటికీ కరోనా వ్యాక్సిన్లు వచ్చినంత మాత్రానా అవి దీర్ఘ కాలంపాటు వ్యాధినిరోధకతను ఇవ్వలేవని అమెరికా ఆరోగ్య సలహాదారు డాక్టర్ ఆంటోనీ ఫాసీ తేల్చేశారు. కరోనా వైరస్ ల చరిత్రను ఓసారి పరిశీలిస్తే.. కామన్ కరోనా వైరస్ కారణంగా జలుబు వస్తుంది. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఇమ్యూనిటీ అనేది మూడు నుంచి ఆరు నెలల పాటు.. అంటే ఏడాది లోపు ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం పనిచేస్తున్న National Institutes of Health ప్రకారం.. కొవిడ్-19 వ్యాక్సిన్‌ను Moderna డెవలప్ చేస్తోంది. 

వ్యాక్సిన్ ప్రయోగంలో భాగంగా మూడో దశ ట్రయల్స్ కోసం 30వేల మంది వ్యక్తులను చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. వచ్చే జూలై నుంచి మూడో దశ ట్రయల్స్ ప్రారంభించనున్నట్టు చెప్పారు. పొటెన్షియల్ వ్యాక్సిన్ల కోసం జరిగే మూడు నుంచి నాలుగు ట్రయల్స్ లోనూ తాను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వ్యవహరిస్తున్నట్టు పేర్కొన్నారు. 2021 నాటికి కరోనా వ్యాక్సిన్లను వందల మిలియన్ల డోసులను అందుబాటులోకి తీసుకోస్తామని అంచనా వేస్తున్నట్టు ఆంటోనీ తెలిపారు. 

Read: లాక్‌డౌన్‌ కొవిడ్ మరణాలను నివారించింది.. కానీ పరోక్షంగా జీవితాలను కోల్పోవచ్చు

ట్రెండింగ్ వార్తలు