Andrew Symonds: మిస్ యూ సైమో.. సైమండ్స్ మృతికి సంతాపం తెలిపిన సహచర క్రికెటర్లు.. ఎవరు ఏమన్నారంటే..

ఆండ్రూ సైమండ్స్ మరణ వార్తవిని క్రికెట్ ప్రపంచం నివ్వెర పోయింది. కారు ప్రమాదంలో సైమండ్స్ మృతి దిగ్భ్రాంతిని కలిగించిందని సహచర క్రికెటర్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆండ్రూ సైమండ్స్ తో ఉన్న అనుబంధాన్ని, అతని మంచి తనాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ ప్రస్తుత, మాజీ క్రికెటర్లు నివాళులర్పించారు.

Andrew Symonds (2)

Andrew Symonds: ఆండ్రూ సైమండ్స్ మరణ వార్తవిని క్రికెట్ ప్రపంచం నివ్వెర పోయింది. కారు ప్రమాదంలో సైమండ్స్ మృతి దిగ్భ్రాంతిని కలిగించిందని సహచర క్రికెటర్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆండ్రూ సైమండ్స్ తో ఉన్న అనుబంధాన్ని, అతని మంచి తనాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ ప్రస్తుత, మాజీ క్రికెటర్లు నివాళులర్పించారు. ఆస్ట్రేలియా మాజీ ఆల్ రౌండర్ ఆండ్రూ సైమండ్స్ కారు ప్రమాదంలో మృతి చెందినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ఆదివారం వెల్లడించింది. కారు ప్రమాదంలో సైమండ్స్‌ మరణించారనే వార్త వెలువడిన వెంటనే అతని క్రికెట్ సహచరులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆల్ రౌండర్‌కు నివాళులు అర్పించారు. సైమండ్స్‌కు భార్య లారా, చిన్న పిల్లలు క్లో, బిల్లీ ఉన్నారు.

క్రికెట్ ఆస్ట్రేలియా ఛైర్మన్‌ లాచ్‌లాన్ హెండర్సన్ సైమండ్స్‌ మృతి పట్ల సంతాపం తెలిపారు.. ఆస్ట్రేలియన్ క్రికెట్ మరో అత్యుత్తమమైన ఆటగాడిని కోల్పోయింది. ఆండ్రూ రెండు ప్రపంచ కప్ విజయాల్లో కీలక పాత్ర పోషించడమే కాకుండా క్వీన్స్‌లాండ్ తరఫున కూడా గొప్ప ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. తన ఆటతో ఎనలేని అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు. ఈ కష్ట సమయంలో క్రికెట్ ఆస్ట్రేలియా తరపున ఆండ్రూ కుటుంబానికి, సన్నిహితులు, స్నేహితులకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం అని పేర్కొన్నారు.

ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్ క్రిస్ట్ సహచర ఆటగాడు సైమండ్స్ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసాడు. సైమండ్స్ మరణవార్త తననెంతో బాధించిందని అన్నారు. ప్రేమగా, సరదాగా ఉండే స్నేహితుడిని కోల్పోవడం అత్యంత బాధాకరం అంటూ గ్రిల్ కిస్ట్ బాధను వ్యక్తం చేశారు.

ఆండ్రూ సైమండ్స్ మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని భారత్ మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ అన్నారు. ఈ మేరకు ట్విటర్ ద్వారా ఆయన తన సానుభూతిని తెలిపారు. కుటుంబ సభ్యులకు, స్నేహితులకు సానుభూతి తెలిపుతూ సైమండ్స్ ఆత్మకు శాంతిచేకూరాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

ఆండ్రూ సైమండ్స్ మృతి పట్ల భారత్ మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతిని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

ఆండ్రూ సైమండ్స్ మరణ వార్త విషాదాన్ని కలిగించిందని, ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు భారత్ మాజీ క్రికెటర్ అనిల్ కూంబ్లే తన సానుభూతి తెలిపారు.

ఆస్ట్రేలియాలో కారు ప్రమాదంలో ఆండ్రూ సైమండ్స్ మరణం తనను తీవ్ర విషాదానికి గురిచేసిందని పాకిస్థాన్ మాజీ పాస్ట్ బౌలర్ సోయబ్ అక్తర్ అన్నారు. ఈ సందర్భంగా సైమండ్స్ తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మైదానంలో, బయట సైమండ్స్ ఎంతో కలివిడిగా ఉండేవాడని, అలంటి స్నేహితుడిని కోల్పోవడం బాధాకరమన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.