Cute baby defeating karate teacher
Cute baby defeating karate teacher : చూడగానే ముద్దొచ్చే పాలబుగ్గల పసిపాప. కరాటే చేసేస్తోంది. ఏకంగా తనకు కరాటే నేర్పిన టీచర్ నే ఓడించేసింది. గింగిరాలు తిప్పేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చిట్టి తల్లి చేత్తో కరాటే చేస్తుంటే ఆ కరాటే టీచర్ ఆ పసిబిడ్డ చేతిలో ఓడిపోయాడు. కరాటే నేర్పిస్తున్న టీచర్ ని ఎత్తి కింద పడేసింది. కరాటే చేస్తూ చెయ్యి విరిచేసింది. ఆ నొప్పి తట్టుకోలేని సదరు వ్యక్తి తన ఓటమిని ఒప్పేసుకున్నాడు. వైట్ బెల్ట్ ధరించిన పసిపాప..బ్లాక్ బెల్ట్ ధరించిన టీచర్ ను పల్టీలు కొట్టించేసింది. కరాటే ఫోజులతో నెటిజన్లు తెగ ఆకట్టుకుంటున్న ఈ చిచ్చరపిడుగు కాదు కాదు కరాటే పిడుగు వీడియో తెగ వైరల్ అవుతోంది.
ఆ పసిపాప కరాటే టీచర్ చెయ్యి పట్టుకొని లాగగానే.. ఆ టీచర్ అమాంతం కింద పడిపోయాడు. ఇలా రెండు మూడుసార్లు కింద పడిన తర్వాత.. అతన్ని కుడి చెయ్యి పట్టుకొని వెనక్కు విరిచిందా పాప. దాంతో తను ఓడిపోయినట్లు ఆ టీచర్ అంగీకరించాడు. పాప కోసం ఆ టీచర్ ఓడిపోయినట్లుగా చేయటాన్ని చూసిన నెటిజన్లు.. కరాటే కిడ్ చేతిలో ముద్దుగా ఓడిపోయిన టీచర్ అంటూ తెగ మెచ్చుకుంటున్నారు. ఈ వీడియోలో ‘కరాటే కిడ్’ చాలా ముద్దొచ్చేస్తోందంటున్నారు మరికొంతమంది. మరి ఆ కరాటే కిడ్ పై మీరు కూడా ఓ లుక్కేయండీ..
aww so cute!! pic.twitter.com/m4XDUthafF
— Funnyman (@fun4laugh) August 9, 2022