cute white tiger cub prank mom jump,scares
Cute video: వార్నీ ఈ పులికూన చూడండీ ఎంత ముద్దుంగా ఉందో. వెండిలా మెరిసిపోతూ భలే ముద్దుగా ఉంది. ఇంత బుజ్జిగా ఉండే ఈ పులికూన తన తల్లినే భయపెట్టేసింది. తన చిన్నిబిడ్డ చేసిన పనికి తల్లి పులి ఎగిరిపడింది. తల్లి భయానికి పాపం ఆ పులికూన కూడా బిత్తరపోయింది.ఈ చిన్ని వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
రాయల్ బెంగాల్ జాతికి చెందిన తెల్లపులి.. దాని పిల్ల చేసిన పనితో దెబ్బకు దడుసుకుంది. తల్లి ఎన్‌క్లోజర్ బయట ఏదో వెతుక్కుంటూ తింటూ ఉంది. . వెనుక నుంచి ఒక్కసారిగా పులిపిల్ల వచ్చింది. నడుస్తూ కాకుండా గది లోపలి నుంచి ఎగిరి తల్లి ముందు దూకింది. దాంతో తనపై ఏదో దాడి చేస్తుందనుకుందో ఏమోగానీ ఈ తెల్లపులి తల్లి ఉలిక్కిపడింది. ధబ్బున పడిపోయింది. తల్లికి ఝలక్ ఇద్దామనుకున్న ఆ పులికూన తల్లి దడుచుకుని కిందపడేసరికి అదికూడా బిత్తరపోయింది.
తల్లి భయంతో ఉలిక్కిపడి కింద పడిపోవడం చూసి పిల్లపులి కూడా భయపడింది. రెండడుగులు వెనక్కి వేసింది. తర్వాత తల్లికి కోపం వచ్చిందని అర్థం చేసుకుంది. అంతే కామ్ అయిపోయింది. ఏమీ తెలియనట్లుగా మెల్లగా పక్కకు వెళ్లిపోయింది. కేవలం సెకన్ల నిడివిగల ఈ వీడియో చూసిన నెటిజన్లు కడుపుబ్బ నవ్వుకుంటున్నారు.. పిల్లల అల్లరి ఎక్కడైనా ఒకేలా ఉంటుందంటూ నెటిజన్లు విపరీతంగా కామెంట్లు చేస్తున్నారు.
Tiger cub sneaks up on its mom.?? pic.twitter.com/kn7YsZsMpC
— ?o̴g̴ (@Yoda4ever) February 16, 2022