Cyprus Boat Accedent: సైప్రస్ తీరంలో ఘోర ప్రమాదం.. 270 మందితో వెళ్తున్న బోటు బోల్తా.. ఆరుగురు దుర్మరణం
సైప్రస్‌లో (Cyprus Boat Accedent)ఆదివారం మధ్యధరా సముద్రంలో 270 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఒక ఫెర్రీ బోటు ప్రమాదవశాత్తూ బోల్తా పడింది.
- V Santhosh Kumar
- Published on- August 30, 2026 / 08:50 PM IST
Cyprus ferry boat capsizes mediterranean sea 6 dead
- సైప్రస్ తీరంలో బోటు బోల్తా
- ఆరుగురు మృతి, 24 మంది గల్లంతు
- 237 మంది సురక్షితం
Cyprus Boat Accedent: ఐరోపా దేశమైన సైప్రస్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆదివారం మధ్యధరా సముద్రంలో 270 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఒక ఫెర్రీ బోటు ప్రమాదవశాత్తూ బోల్తా పడింది. కిరెనియా పోర్టు నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే బోటులోకి(Cyprus Boat Accedent) నీరు చేరడంతో ఈ దుర్ఘటన జరిగింది. సమాచారం అందుకున్న స్థానిక అధికారులు, సహాయక బృందాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని శరవేగంగా సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు మృతి చెందినట్లు అధికారులు ధ్రువీకరించారు.
APSRTC Home Pickup: ఇక బస్టాప్ కు వెళ్లాల్సిన అవసరం లేదు.. ఇంటి వద్దకే బస్సు.. RTC బంపర్ ఆఫర్
సహాయక చర్యలు ముమ్మరం:
ఈ ప్రమాదం నుంచి సహాయక బృందాలు సమయస్ఫూర్తితో వ్యవహరించి ఇప్పటివరకు 237 మంది ప్రయాణికులను సురక్షితంగా రక్షించగలిగాయి. అయితే, మరో 24 మంది ప్రయాణికులు నీటిలో గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. గల్లంతైన వారి కోసం సముద్రంలో హెలికాప్టర్లు, నిపుణులైన ఈతగాళ్లతో విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ప్రయాణికుల రక్షణకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది.
