డేంజర్ జోన్.. Paracetamol ఎక్కువగా తీసుకుంటున్నారా? ప్రాణాలకు ముప్పంట జాగ్రత్త!

  • Publish Date - September 9, 2020 / 09:01 PM IST

కొంచెం జ్వరంగా అనిపిస్తే చాలు.. ఒళ్లు నొప్పులు ఉన్నా పారాసెటమాల్ వేసుకుంటుంటారు.. పారాసెటమాల్ తీసుకోవడం వల్ల రిస్క్ ఉంటుందనే అవగాహన ప్రతిఒక్కరిలో ఉండాలంటున్నారు నిపుణులు.. లేదంటే మీ ప్రాణాలకే ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు.. నొప్పుల నివారణకు ప్లేసిబో డ్రగ్ ఇచ్చిన దానికంటే ఎక్కువ రిస్క్ ఉంటుందనిపరిశోధకులు కనుగొన్నారు.



ఒహియో స్టేట్ యూనివర్శిటీ నిపుణులు జరిపిన ఒక అధ్యయనంలో తేలింది. అమెరికాలో Acetaminophen అనే నొప్పి నివారణ డ్రగ్స్ తలనొప్పికి చికిత్సగా వాడుతుంటారు.. ఇదే ప్రమాదానికి దారి తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధ్యయనంలో భాగంగా 189 మందికి నొప్పి నివారణ కోసం ప్లేసిబో డ్రగ్ 1,000 మి.గ్రా ఇచ్చారు. తలనొప్పి తగ్గడానికి ఇదే మోతాదు ఇచ్చారు. ఆ తర్వాత పాల్గొన్నవారిని పరిశోధకులు ప్రశ్నించారు. డ్రగ్ తీసుకున్న తర్వాత వారిలో కనిపించిన లక్షణాలేమి ఉన్నాయో వారిని ఒకటి నుంచి ఏడు వరకు రేట్ చేయమని కోరారు.



పారాసెటమాల్ రేట్ చేసిన వాటిలో రాత్రిపూట ప్రమాదకర ప్రాంతంలో ఒంటరిగా నడవడం, స్కైడైవింగ్, బంగీ జంపింగ్ చేసినట్టు చెప్పారు. 30 ఏళ్ళలో ప్లేసిబో తీసుకున్న వారి కంటే తక్కువ ప్రమాదకరంగా ఉన్నాయని అధ్యయనం సహ రచయిత బాల్డ్విన్ బే చెప్పారు.

అమెరికాలో 25 శాతం జనాభా ప్రతి వారం ఈ నొప్పి నివారణ మందులను తీసుకుంటారు. టైలెనాల్‌లో Acetaminophen కూడా ప్రధానంగా వాడే ఔషధం.. దీనిని యుఎస్ అంతటా విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.



నిపుణులు వర్చువల్ టెస్టు ద్వారా పరిశోధకులు విశ్లేషించారు. మరో అధ్యయనంలో 545 అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు పారాసెటమాల్ మోతాదు ఇచ్చి పరీక్షించారు. ఈ మోతాదు తీసుకున్న అనంతరం వారిని సీట్ బెల్ట్ లేకుండా డ్రైవింగ్ చేయడం, దొంగిలించడం, డ్రగ్స్ ఆల్కహాల్ ఉపయోగించడం వంటి వ్యాయామాలు చేయాలని సూచించారు. కోవిడ్ -19 సోకిన వారికి చికిత్స కోసం CCC ప్రస్తుతం Acetaminophenను సిఫారసు చేస్తోంది.

ట్రెండింగ్ వార్తలు