Sperm count
Sperm count: పురుషులకు ఇది చేదువార్త. మారుతున్న వాతావరణ మార్పులు, ఆహారపు అలవాట్ల మూలంగా పురుషుల్లో వీర్యకణాల వృద్ధి (స్పెర్మ్ కౌంట్) తగ్గిపోతుందని గతంలో పలు నివేదికలు చెప్పాయి. తాజాగా ఇజ్రాయెల్ నేతృత్వంలోని అంతర్జాతీయ పరిశోధకుల బృందం జరిపిన పరిశోధనల్లో ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో పురుషుల్లో వీర్యం వృద్ధి గణనీయంగా తగ్గుతున్నట్లు తేల్చారు. ఈ ప్రక్రియను మానవ పునరుత్పాదక లోపంగానే కాకుండా పురుషుల్లో ఆరోగ్య కోణంలోనూ చూడాల్సి ఉంటుందని చెప్పారు. పురుషుల్లో వీర్య వృద్ధి తగ్గితే దీర్ఘకాలిక వ్యాధులు, వృషణాల క్యాన్సర్, జీవితకాలంలో తగ్గుదల వంటి ప్రమాదాలు పొంచిఉంటాయని పరిశోధకులు హెచ్చరించారు.
Sperm Count : వీర్యకణాలను పెంచే వాల్ నట్స్!
ఈ క్షీణతను ఆధునిక పర్యావరణ పరిస్థితులు, జీవనశైలుల పరంగా ప్రపంచ సంక్షోభంగా న్యూ యార్క్ ఇకాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో ప్రొఫెసర్ షాన్నా స్వాన్‌తో కలిసి చేసిన అధ్యయనానికి ఇజ్రాయోల్‌లోని జెరూసలేంకు చెందిన హిబ్రూ యూనివర్శిటీకి ప్రొఫెసర్. హగై లెవిన్ చెప్పారు. వీరి పరిశోధన ప్రకారం, 1973 నుండి ప్రపంచవ్యాప్తంగా పురుషుల్లో వీర్యకణాల వృద్ధి 62 శాతం క్షీణించింది. 1973 నుంచి 2011 మధ్యకాలంలో అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పురుషులలో స్పెర్మ్ కౌంట్ 50శాతం కంటే ఎక్కువ పడిపోయింది.
Sperm Count: పెను సవాల్.. పురుషుల్లో తగ్గుతున్న వీర్య కణాల సంఖ్య.. కారణం ఇదే!
తాజాగా 53దేశాల నుంచి సేకరించిన ఈ అధ్యయనం వివరాలు ‘హ్యూమన్ రీప్రొడక్షన్ అప్‌డేట్ జర్నల్’లో ప్రచురితమయ్యాయి. వీటి ప్రకారం.. ప్రపంచ దేశాల్లో భారతదేశంలో సహా.. పురుషుల్లో వీర్యకణాల వృద్ధి 62శాతం తగ్గుదల కనిపించిందని హీబ్రూ విశ్వవిద్యాలయ ప్రొఫఎసర్ హగాయ్ లెవిన్ తెలిపారు. ఇటీవల సంవత్సరాల్లో ఈ తగ్గుదల వేగం మరింత పెరిగిందని ఆయన అన్నారు. అయితే క్షీణతకు కారణాలు ఏమిటన్న దానిపై మాత్రం ఈ అధ్యయనం దృష్టి పెట్టలేదు. జీవనశైలి ఎంపికలు, పర్యావరణంలో రసాయనాల పెరుగుదల ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని లెవిన్ అభిప్రాయ పడ్డారు. ఇది చిన్న సమస్య కాదని, మానవ జీవన వృద్ధితోపాటు, పురుషుల ఆరోగ్యంపైనా ప్రభావంగా భావించాలని, ప్రపంచ దేశాలు ఈ సమస్యపై తక్షణం స్పందించాలని తాము కోరుతున్నట్లు లెవిన్ తెలిపాడు.