Sperm Count: పెను సవాల్.. పురుషుల్లో తగ్గుతున్న వీర్య కణాల సంఖ్య.. కారణం ఇదే!

పురుషుల్లో వీర్య కణాల తగ్గుదల సవాల్ గా మారింది. వందకి పది మంది పురుషుల్లో వీర్య కణాల సంఖ్య ఉండవలసిన దానికంటే తక్కువగా ఉందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. సాధారణంగా గర్భధారణ కావాలి అంటే ఒక మిల్లీ లీటరుకు 15 నుంచి 30 మిలియన్ల కణాలు ఉండాలి.

Sperm Count: పెను సవాల్.. పురుషుల్లో తగ్గుతున్న వీర్య కణాల సంఖ్య.. కారణం ఇదే!

Sperm Count

Sperm Count: పురుషుల్లో వీర్య కణాల తగ్గుదల సవాల్ గా మారింది. వందకి పది మంది పురుషుల్లో వీర్య కణాల సంఖ్య ఉండవలసిన దానికంటే తక్కువగా ఉందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. సాధారణంగా గర్భధారణ కావాలి అంటే ఒక మిల్లీ లీటరుకు 15 నుంచి 30 మిలియన్ల కణాలు ఉండాలి. అంతకంటే తక్కువగా ఉంటే వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉందని నిర్దారణకు రావచ్చు. తాజాగా పురుషుల్లో వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉండటానికి సంబంధించి ప్రముఖ ఎపిడమాలజిస్ట్, అవార్డ్ విన్నింగ్ శాస్త్రవేత్త షన్నా హెచ్. స్వాన్ కొన్ని షాకింగ్ విషయాలను బయటపెట్టారు.

ఆమె రాసిన కౌంట్‌డౌన్’ అనే పుస్తకంలో వీర్యకణాల గురించి షాకింగ్ విషయాలు పొందుపరిచారు. ‘కౌంట్‌డౌన్’లో చెప్పిన కొన్ని విషయాలు పురుషుల్లో పిల్లలు పుట్టించగలిగే సామర్థ్యంపైనే అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. ఇప్పటికే పురుషుల్లో వీర్యకణాల సంఖ్య దారుణంగా పడిపోయినట్లు షన్నా హెచ్. స్వాన్ తన పుస్తకంలో రాశారు. మరో 40 ఏళ్లలో పురుషుల్లో వీర్యకణాల సంఖ్య 50 శాతానికి పైగా పడిపోయే అవకాశం ఉందని ఆమె వెల్లడించారు. 2060 నాటికీ గర్భానికి అవసరమయ్యే కణాలు మెజారిటీ పురుషుల్లో ఉండవని ఆమె తేల్చి చెప్పారు. ఇది ఒక్క మానవ జాతిలోనే కాదు అన్ని జంతువుల్లో ఇదే పరిస్థితి ఉందని పేర్కొన్నారు.

అయితే ఇది ఆందోళన కలిగించే విషయమే.. ప్రధానంగా వీర్యకణాలు తగ్గడానికి కారణం రసాయనిక ఎరువులే అని షన్నా చేసిన పరిశోధనల్లో తేలిందట. ఇదిలా ఉంటే పురుషుల్లో వీర్య కణాలు తగ్గిపోతున్నాయనే విషయం 1990లో మొదటి సరిగా బయటకు వచ్చింది. ఇక 2017లో వీర్య కణాలపై ఓ సంస్థ పరిశోధన చేసింది. ఈ పరిశోధనల్లో భయానకమైన విషయాలు బయటపడ్డాయి.. పురుషుల్లో వీర్య కణాల సంఖ్య 1973 నుంచి 2011 మధ్యలో 50 నుంచి 60 శాతం పడిపోయిందని ఈ పరిశోధనల్లో వెల్లడైంది. ఈ విషయాలను కూడా ఆమె తన పుస్తకంలో పొందుపరిచారు.

2045 నాటికి సంతానోత్పత్తి కోసం చాలా జంటలు సహజ శృంగార ప్రక్రియకు బదులు ప్రత్యామ్నయ మార్గాలను అన్వేషించే అవకాశం ఉందని స్వాన్ చెప్పుకొచ్చారు. కౌంట్‌డౌన్’ పుస్తకంలో వీర్యకణాలు తగ్గిపోతున్నాయని చెప్పారు కానీ వృద్ధి చెందడానికి తీసుకోవాల్సిన చర్యలను షన్నా తెలపలేదు. చాలామంది వైద్యులు ఈమె చెప్పిన విషయాలను సమర్థిస్తున్నారు. షన్నా చెప్పినవి వాస్తవాలే అని తెలిపారు.