Delivery Guy Steals Customer's Food
Delivery Guy Steals Customer’s Food : కరోనా మహమ్మారి కాలంలో ఫుడ్ డెలివరీ అనేది సర్వసాధారణంగా మారింది. బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండి నచ్చిన్ ఫుడ్ ఆర్డర్ చేసేసుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ కంపెనీలు కూడా యాప్ ఆధారిత సర్వీసులను అందిస్తున్నాయి. ఫుడ్ ఆర్డర్ చేసిన వెంటనే ఇంటికే డోర్ డెలివరీ చేసేస్తున్నాయి. దాంతో ఆన్ లైన్ ఫుడ్ ఆర్డర్ చాలా ఈజీ అయిపోయింది. ఇందులో ఎంత ఉపయోగం ఉందో అంతే ఇబ్బందులు లేకపోలేదు. ఫుడ్ డెలివరీ చేయాల్సిన సిబ్బంది ఆ ఫుడ్ తినేయడం లేదా దొంగిలించడం వంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.
Uber Eats కు చెందిన డెలివరీ బాయ్ కూడా ఆర్డర్ చేసిన ఫుడ్ దొంగిలించాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆన్ లైన్ ఆర్డర్ చేసిన ఫుడ్ ను తింటూ సగాన్ని మరో బాక్సులో దాచేయడాన్ని వీడియోలో చూడొచ్చు. ఈ వీడియోను Garden State Mix అనే యూట్యూబ్ లో అప్ లోడ్ చేయగా.. 185వేల వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోలో డెలివరీ బాయ్.. రోడ్డుపక్కన తన బైక్ పార్క్ చేసి కూర్చొని ఉన్నాడు. ఆర్డర్ ఫుడ్ ప్యాకేజీలోను ఓపెన్ చేసి కొంతమొత్తాన్ని తన టిఫిన్ బాక్సులో దాచేయడం కనిపిస్తోంది.
Eatings Oats : త్వరగా బరువు తగ్గే ఆహారం కోసం వెతుకుతున్నారా…అయితే అలాంటి ఫుడ్ ఇదే..
డెలివరీ బాయ్.. ఫుడ్ ప్యాకేజీలోని కొన్ని ఫ్రై చేసిన నూడిల్స్, కొంత సూప్ తీసుకోవడం చూడొచ్చు. ఆ తర్వాత ఫుడ్ ప్యాకేజీలను సీల్ వేసి బ్యాగులో పెట్టేసుకున్నాడు. ఆకలిగా ఉండొచ్చు.. కానీ, ఒకరు ఆర్డర్ చేసుకున్న ఫుడ్ ఇలా దొంగిలించడం సరికాదని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.