Mullah Baradar: తాలిబన్ ప్రభుత్వంపై అసంతృప్తితోనే బరాదర్‌ అజ్ఞాతవాసం!

డిప్యూటీ పీఎంగా నియమితుడైన తాలిబన్ సహ వ్యవస్థాపకుడు ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ ముష్కురల ప్రభుత్వంపై అసంతృప్తితోనే కాబుల్ విడిచి అజ్ఞాతంలోకి వెళ్లారనే ప్రచారం జరుగుతోంది.

Deputy Afghan PM Mullah Baradar : అప్ఘానిస్తాన్‌లో తాలిబన్ రాజ్యమేలుతోంది. వారు చెప్పిందే శాసనం.. ఇప్పుడు తాలిబన్ ప్రభుత్వం కూడా ఏర్పాటు అయింది. తాలిబన్ ముఠా సభ్యుడు ముల్లా మహమ్మద్ హసన్ అఖుంద్ అప్ఘాన్ ప్రధానమంత్రిగా నియమించారు. మంత్రివర్గంలో హక్కానీలకు ప్రత్యేక స్థానం లభించింది. డిప్యూటీ పీఎంగా నియమితుడైన తాలిబన్ సహ వ్యవస్థాపకుడు ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ (Mullah Abdul Ghani Baradar) ముష్కురల ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారు. తాలిబన్ ప్రభుత్వ కూర్పుపై అసంతృప్తిగా ఉన్నట్టు తెలిసింది. అందుకే హక్కానీలతో బరాదర్ మాటల యుద్ధానికి దారితీసింది. దాంతో మనస్థాపానికి గురైన బరాదర్ కాబుల్ విడిచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారనే ప్రచారం జరుగుతోంది.
Akkineni Heroes: బ్యాక్ టూ బ్యాక్ అక్కినేని సినిమాలు.. హ్యాపీ మూడ్‌లో ఫ్యాన్స్!

అప్ఘాన్ ఉప ప్రధాని బరాదర్ అదృశ్యమైపోయారు. కొన్ని రోజులుగా తానెక్కడా కనిపించడంలేదు. సమావేశాలకు, మీడియా ఎదుట కూడా హాజరుకావడంలేదు. తాలిబన్ల మధ్యంతర ప్రభుత్వ ఏర్పాటు సందర్భంగా ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. ఆ సమయంలో బరాదర్ తీవ్రంగా గాయపడి మరణించారంటూ స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి. తాను మరణించినట్టు వచ్చిన వార్తలపై బరాదర్ స్పందిస్తూ.. వీడియో ద్వారా మెసేజ్ పంపారు. తాను క్షేమంగానే ఉన్నానని, చనిపోలేదని స్పష్టం చేశారు. ప్రభుత్వంలో హక్కానీలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం తనకు నచ్చలేదని అన్నారు. ఆ అసంతృప్తితోనే కాందహార్‌లో అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలుస్తోంది.

ఇస్లామిక్ ఎమిరేట్స్ ఆఫ్ అఫ్గానిస్థాన్ ప్రభుత్వ ఏర్పాటులో పాక్ జోక్యం చేసుకుంది. పాక్ ఐఎస్ఐ చీఫ్ ఫయాజ్ అహ్మద్ అప్ఘాన్ కు వెళ్లి పావులు కదిపారు. ఇందులో అబ్దుల్లా అబ్దుల్లా, హమీద్ కర్జాయ్ వంటి వారికి చోటు దక్కలేదు. పాక్ జోక్యంపై దోహా బృందం అసంతృప్తిగానే ఉన్నట్టు తెలుస్తోంది. హక్కానీలతో గొడవ విషయంలోనే తాను కనిపించకుండా పోయాడనే టాక్ నడుస్తోంది.
Big Boss 5: ఏడుగురిని గొర్రెలుగా చేసిన హౌస్‌లోకి వచ్చిన ఓ గుంట నక్క!

ట్రెండింగ్ వార్తలు