World Moost Beautiful Police officer Diana Ramirez : అందమైన అమ్మాయి ర్యాంప్ మీద క్యాట్ వాక్ చేస్తూ చూడటానికి రెండు కళ్లూ చాలవు. అందంగా ఉన్న అమ్మాయిలు చాలామంది మోడల్ రంగంపై మక్కువ పెంచుకుంటారు. మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ వంటి పోటీల్లో గెలవాలని కలలు కంటారు. కానీ అందానికే అసూయ పుట్టించేంత సౌందర్యవతి మాత్రం పోలిస్ అధికారి కావాలనుకుంది. అనుకోవటమే కాదు అయ్యింది. అందం అంటే డ్యూటీ అంటోందీ ముద్దుగుమ్మ. పోలీస్ యూనిఫాంలో ధీరగా దర్శనించే ఈ అందం వెనుక రిస్కుతోనే కిక్కు ఉంటుంది అనే ధీరత్వం ఉంది. మోడలింగ్ అంటే ఎంతో ఇష్టం ఉన్నా..ఆమెకు ఎంతో ఇష్టమైన పోలీస్ ఉద్యోగంలోనే చేరింది. పోలీస్ యూనిఫాం వేసుకుంటే ఆ గర్వమే వేరు అంటున్న ఈ అందాల భామ ‘ప్రపంచంలోనే అందమైన పోలీసు’గా పేరొందింది. ఆమే ‘డయానా రమిరెజ్’. అమెరికాలోని కొలంబియాకు చెందిన డయానా రమిరెజ్ ఓ పోలీస్ ఆఫీసర్..మెడెలిన్ లో డ్యూటీ చేస్తోంది.
Beautiful Mosquito: ప్రపంచంలోనే అందమైన దోమ..కుట్టినా చంపాలని అనిపించదట..!
ఇంత అందంగా ఉన్నావు ఏ గ్లామర్ రంగంలోకో వెళ్లొచ్చు కదాని ఆమెకు సలహాలు సూచనలు ఇస్తుంటారు చాలామంది కానీ ఆమె మాత్రం పోలీస్ ఉద్యోగం అంటే ప్రాణం అని నాకు మళ్లీ కెరీర్‌ని ఎంచుకునే అవకాశం వస్తే.. కచ్చితంగా మళ్లీ పోలీస్ ఆఫీసర్ అవుతానని చెబుతోంది. అంటే ఆమెకు పోలీసు ఉద్యోగం అంటే ఎంత ఇష్టమో అర్థం చేసుకోవచ్చు. పోలీసు డ్రెస్ వేసుకుంటే వచ్చే ఆ కిక్కే వేరప్పా అంటుంది. పోలీసుగా డ్యూటీ చేయటం గర్వంగాను..గౌరవంగా భావిస్తానని చెబుతోందీ అందాల ఆడ పోలీసు.మోడలింగ్ అంటే ఇష్టమే కానీ మోడలింగ్ కోసం కోసం పోలీస్ ఉద్యోగం మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనే వదులుకోను అని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
ప్రపంచంలో ఐదుగురు అందమైన ఉమెన్ క్రికెటర్లు వీరే..
అందాల పోలీసుకు ఇన్‌స్టాలో 4 లక్షల మంది ఫాలోవర్లు
ఈమధ్యే ఇన్‌స్టాఫెస్ట్ అవార్డ్స్‌లో ‘బెస్ట్ పోలీస్ ఆఫీసర్, మిలిటరీ ఆఫీసర్‌గా ఆఫ్ ది ఇయర్’గా డయానా నామినేట్ అయింది. డిజిటల్ కంటెంట్‌ని ఎక్కువ మందికి చేరవేస్తున్నవాళ్లని గుర్తించడమే ఈ అవార్డు ఉద్దేశం. దీంతో డయానా ఫొటోలు సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన నగరంగా పేరొందిన మెడిలిన్ వీధుల్లో డయానా పెట్రోలింగ్ నిర్వహిస్తోంది. ఈమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో నాలుగు లక్షల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. రోజుకు 14గంటలు ఆమె డ్యూటీలోనే ఉంటుంది. తన సర్వీసులో ఎంతోమంది నేరగాల్ల ఆటకట్టించిందీ అందాల పోలీసు. నా దేశం కోసం నేరరహిత సమాజం కోసం నేను పాటుపడుతునే ఉంటానని చెబుతోంది. అందుకే ఈ పోలీసు ఉద్యోగాన్ని ఎంచుకున్నానని చెబుతోంది.