Body-Double: అలాస్కాలో ట్రంప్‌తో సమావేశమైంది అసలు పుతిన్ కాదా..! తన బాడీ డబుల్‌ను పంపాడా..? అసలేం జరిగిందంటే..

అలాస్కాలో డొనాల్డ్ ట్రంప్ తో భేటీ అయింది అసలైన పుతిన్ కాదని.. అతని బాడీ డబుల్ (Body-Double) పాల్గొన్నారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది..

Body-Double

Body-Double: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అమెరికాలోని అలాస్కా వేదికగా శుక్రవారం సమావేశం అయిన విషయం తెలిసిందే. వీరిద్దరి మధ్య యుక్రెయిన్‌తో యుద్ధం ముగించే అంశంపై దాదాపు రెండున్నర గంటలపాటు చర్చలు జరిగాయి.

భేటీ అనంతరం ఇద్దరు దేశాధ్యక్షులు ప్రెస్ కాన్ఫరెన్సులో పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించినట్లు వారు తెలిపారు. చర్చలు సానుకూలంగా సాగాయని, కానీ ఎలాంటి ఒప్పందాలు జరగలేదని చెప్పారు. అయితే, ఈ భేటీపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ అయ్యేందుకు వచ్చింది అసలు పుతినేనా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలు పుతిన్ స్థానంలో ఆయన బాడీ డబుల్ వచ్చారంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.

Also Read: Donald Trump: పుతిన్‌తో భేటీ తరువాత.. భారత్‌పై అదనపు సుంకాల గురించి ట్రంప్ కీలక కామెంట్స్..

ట్రంప్‌తో భేటీకి పుతిన్ తన బాడీ డబుల్‌ను పంపించారని సోషల్ మీడియా వేదికగా కొందరు చర్చకు తెరలేపారు. ట్రంప్‌తో భేటీ సమయంలో పుతిన్ నడక, ఆయన హావభావాలు, అతని ముఖ ఆకృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అలాస్కాలో అడుగుపెట్టిన వ్యక్తికి బుగ్గలు కాస్త ఉబ్బినట్లుగా, నునుపుగా ఉన్నాయని.. ఆయన అసలు పుతినేనా అంటూ అనుమానం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. మరికొందరు నెటిజన్లు.. ట్రంప్ ను కలిసినప్పుడు రష్యన్ అధ్యక్షుడు గతంకంటే ఎక్కువ ఉల్లాసంగా కనిపించాడని పేర్కొన్నారు.

రష్యా అధ్యక్షుడు తన తరపున అప్పుడప్పుడు బహిరంగ వేదికలు, బహిరంగ ప్రదేశాల్లోకి తన బాడీ డబుల్‌ను పంపిస్తాడని ఆరోపిస్తూ మరికొందరు నెటిజన్లు పేర్కొన్నారు. ‘‘అతను నిజంగా నిజమైన పుతిన్ కాదు. వాళ్ళు మంచి బాడీ డబుల్‌ను కూడా పంపలేదు, “జోవియల్ పుతిన్” ని పంపారు. సాధారణంగా చిన్నచిన్న బహిరంగ వేదికలపై ఈ బాడీ డబుల్ ను వాడుతారు. తక్కువ ఖర్చుతో కూడుకున్న వ్యక్తి అతను. నార్త్ కొరియాలో కిమ్‌ని కలవడానికి వెళ్ళాడు. ఆ హెయిర్ స్టైల్ లైన్‌ని, ఆ చంపలను చూడండి.’’ అంటూ ఓ నెటిజన్ పేర్కొన్నాడు.


పుతిన్ అంటే వెంటనే గుర్తుకొచ్చేది కేజీబీ వాకింగ్ స్టైల్. గతంలో రష్యాకు చెందిన కేజీబీ గూడాచారిగా పనిచేసిన పుతిన్ కుడి చేతిని కదిలించకుండా ఎడమచేతిని కదిలిస్తూ నడుస్తుంటారు. ఇది ఆయన ట్రెండ్ గా మారిపోయింది. తాజాగా.. ట్రంప్ తో భేటీ సమయంలో పుతిన్ ట్రేడ్ మార్క్ అయిన గన్ స్లింగర్ వాక్ లేదని, ముఖ్యంగా ఆయన తన కుడి చేతిని కదిలిస్తున్నాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
అతని బుగ్గలు ఉబ్బినట్లు, నునుపుగా ఉన్నాయి. అతను ఎక్కువగా నవ్వుతున్నాడు. అతను అన్ని సమయాల్లో నవ్వును ఆపుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది అంటూ మరొకరు పేర్కొన్నారు. ఇలా పలువురు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా అలాస్కాలో ట్రంప్ తో భేటీ అయింది.. నిజమైన పుతిన్ కాదంటూ కామెంట్స్ చేస్తున్నారు.

పుతిన్ బాడీ డబుల్ గతంలోనూ జోరుగా చర్చలు..
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన తరపున బాడీ డబుల్స్‌ను ఉపయోగించడంపై గతంలోనూ అనేక సందర్భాల్లో ఆరోపణలు వచ్చాయి. పుతిన్ బహుళ బాడీ డబుల్స్ ను కలిగి ఉన్నాడన్న విమర్శలు కూడా ఉన్నాయి.

పుతిన్ ట్రేడ్‌మార్క్ అయిన గన్‌స్లింగ్ నడక (కేజీబీ నడక) వేరే వ్యక్తులు అచ్చుగుద్దినట్లు అమలు చేయడం చాలా కష్టం. ఈ నడకలో పుతిన్ కుడి చేయి కదలకుండా ఉంటుంది. మరో చేయి తన బాడీతోపాటు కదులుతుంటుంది. చాలా మంది న్యూరాలజిస్టులు ఇది వైద్యపరమైన సమస్య కాదని సూచించారు. కానీ, అతనికి ఈ నడక విధానం ప్రధానంగా సోవియట్ భద్రతా దళంలో కేజీబీ శిక్షణ నుంచి వచ్చిందని చెబుతుంటారు.

కేజీబీ ఏజెంట్లు తమ ఆయుధం ధరించే చేతిని ఛాతికి దగ్గరగా లేదా అత్యవసర సమయంలో వేగంగా తుపాకీని తీసుకొనేలా చేతిని కదపకుండా ఉంచుతూ మరో చేతిని కదిలిస్తూ నడుస్తారు. ఈ విషయం ఎలాఉన్నా.. ప్రస్తుతం ట్రంప్ తో అలాస్కాలో భేటీ అయింది నిజమైన పుతినేనా..? అతని బాడీ డబుల్ నా అనే అంశంపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరుగుతుంది.