రష్యా-యుక్రెయిన్ వార్ చివరి దశకు చేరుకుందా? జెలెన్ స్కీ వ్యూహం ఏంటి?

రష్యాపై దాడులను తీవ్రతరం చేసి వారి ఆస్తులకు నష్టం కలిగిస్తేనే ఆ దేశం యుద్ధం ఆపేస్తుందని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీకి నమ్మకం వచ్చిందా?

Russia – Ukraine War : రష్యా-యుక్రెయిన్ వార్ చివరి దశకు చేరుకుందా? రెండున్నరేళ్లుగా విరామమే లేకుండా సాగుతున్న భీకర పోరును ముగించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయా? శాంతి ఒప్పందాలకు పరిస్థితులు సానుకూలంగా లేకపోవడంతో శత్రువుపై పైచేయి సాధించడం ద్వారా విజయం సాధించాలని భావిస్తున్న దేశం ఏది? రష్యాపై దాడులను తీవ్రతరం చేసి వారి ఆస్తులకు నష్టం కలిగిస్తేనే ఆ దేశం యుద్ధం ఆపేస్తుందని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీకి నమ్మకం వచ్చిందా? అందుకే డ్రోన్లతో అటాక్ చేస్తున్నారా? రష్యా-యుక్రెయిన్ వార్ లో ఏం జరగబోతోంది?

యుద్ధంలో విజయం సాధించాలని రష్యా, రష్యాను ఒత్తిడికి గురి చేసి యుద్ధం విరమించేలా చేయాలని యుక్రెయిన్.. ఎవరి పంతం వారిదే, ఎవరి వ్యూహం వారిదే. పశ్చిమ దేశాల అండతో యుక్రెయిన్, చైనా నార్త్ కొరియా ప్రోద్బలంతో రష్యా తగ్గేదేలే అన్నట్లుగా పోరు కొనసాగిస్తున్నాయి. భీకర పోరుతో వేలాది మంది ప్రాణాలను, విలువైన ఆస్తులను పణంగా పెడుతున్నాయి. మరి ఈ పోరుకు ముగింపు ఎప్పుడు?

 

Also Read : ఎలోన్‌ మ‌స్క్‌కు బిగ్ షాకిచ్చిన బ్రెజిల్ సుప్రీంకోర్టు.. దేశవ్యాప్తంగా ‘ఎక్స్’ సేవలపై నిషేదం.. ఎందుకంటే?

ట్రెండింగ్ వార్తలు