Pregnency Time
Pregnancy Time: ప్రెగ్నెన్సీ సమయంలో ఇన్ఫెక్షన్ ను తగ్గించే స్ప్రేలు, రసాయనాలు వాడితే గర్భిణీ మహిళలకు ప్రమాదకరమని సూచిస్తున్నారు. గర్భంలో ఉన్న పిల్లలకు ఆస్తమా, ఎగ్జిమా లాంటి రిస్క్ లు వచ్చే అవకాశాలు ఉన్నాయని స్టడీ చెప్తుంది. ఆక్యూపేషనల్ అండ్ ఎన్విరాన్మెంటల్ మెడిసిన్ అనే ఓ జర్నల్ లో పబ్లిష్ అయిన కథనం ప్రకారం.. హాస్పిటల్స్, ఇతర మెడికల్ ఫెసిలిటీస్‌లో వాడే డిస్‌ఇన్ఫెక్టెంట్స్ కచ్చితంగా పేషెంట్లు, జనరల్ పాపులేషన్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయని తేలింది.
వర్క్‌ప్లేస్‌లో ఉండే డిస్‌ఇన్ఫెక్టెంట్స్ కారణంగా ఆస్తమా, డెర్మటైటిస్‌లకు వర్కర్లు ఎక్స్‌పోజ్ అవుతారు. కానీ, కొన్ని స్టడీల్లో తెలిసిన దానిని బట్టి ప్రెగ్నెన్సీ సమయంలో డిస్ఇన్ఫెక్ట్ ల వాడకం పుట్టబోయే పిల్లల్లో అలర్జీలకు కారణమవుతుంది.
ఈ స్టడీ కోసం మొత్తం 78వేల 915మంది తల్లీబిడ్డల డేటాను పరిశీలించారు. జపాన్ ఎన్విరాన్మెంట్ అండ్ చిల్డ్రన్ స్టడీ జరిపిన పరీక్షలో పనిచేసే ప్రదేశంలో జరిగిన డిస్ఇన్ఫెక్టెంట్లు 3ఏళ్ల వరకూ పిల్లల్లో అలర్జిక్ సమస్యలకు దారి తీస్తున్నట్లు తెలిసింది. ఎక్కువ మందిలో ఆస్తమా లేదా ఎగ్జిమా సమస్యలు కనిపించాయి. ఆరు వారాలకోసారి ఈ రిస్క్ లు గమనించారు.
Read Also: గర్భిణీలపై కరోనా తీవ్ర ప్రభావం
ఇటీవలి కాలంలో కరోనావైరస్ కోసం వాడే డిస్ఇన్ఫెక్టెంట్స్ పబ్లిక్ హెల్త్ పై చాలా ప్రభావం చూపించాయి. కొన్నింటి కారణంగా అలర్జిక్ సమస్యల రిస్క్ ను కూడా ఎంతవరకూ ఉందో విశ్లేషించాలి. గర్భిణీగా ఉన్నప్పుడు తల్లులు వాడే డిస్ఇన్ఫెక్టెంట్లు పిల్లలపై ప్రభావానికి కారణంగా మారుతున్నాయి.