Russia vs Ukraine War: వామ్మో అంత భారీ నష్టమా..! యుక్రెయిన్‌‌లో రష్యా సైనికులు ఎంతమంది మరణించారో తెలుసా..?

రష్యా - యుక్రెయిన్ దేశాల మధ్య సుమారు ఎనిమిది నెలలుగా భీకర యుద్ధం కొనసాగుతోంది. ఈ యుద్ధంలో రష్యా సైతం తీవ్ర నష్టాన్ని చవిచూసింది. తాజాగా యుక్రెయిన్ విడుదల చేసిన వివరాల ప్రకారం.. ఆ దేశంలో రష్యా సైనికులు దాదాపుగా..

Russia vs Ukraine War: రష్యా, యుక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. సుమారు 240 రోజులుగా యుక్రెయిన్‌లో బాంబుల మోత మోగుతూనే ఉంది. యుక్రెయిన్‌లోని చాలా ప్రాంతాల్లో రష్యా సైన్యం క్షిపణుల వర్షం కురిపిస్తోంది. కొద్దిరోజుల క్రితం రష్యా సైన్యం దాడుల తీవ్రతను తగ్గించినట్లు కనిపించగా.. ఇటీవల రష్యా, క్రిమియా మధ్య వంతెనను పేల్చివేయడంతో రష్యా దాడులను తీవ్రతరం చేసింది.

Russia vs Ukraine War: మరోసారి పేలుళ్లతో దద్దరిల్లిన యుక్రెయిన్ రాజధాని కీవ్.. కామికేజ్ డ్రోన్లు ఉపయోగం..

సుమారు ఎనిమిది నెలలుగా కొనసాగుతున్న భీకరపోరులో రష్యా సైతం తీవ్ర నష్టాన్ని చవిచూసింది. తాజాగా యుక్రెయిన్ విడుదల చేసిన వివరాల ప్రకారం.. ఆ దేశంలో రష్యా సైనికులు దాదాపు 66,750 మంది మరణించారు. యుక్రెయిన్ మొత్తం 66,750 మంది రష్యా సైనికులను హతమార్చగా, 269 యుద్ధ విమానాలను ధ్వంసం చేసింది. 263 హెలికాప్టర్లు, 2,573 ట్యాంకులు, 1,325 మానవ రహిత విమానాలు, 147 స్పెషల్ ఎక్విప్మెంట్, 16 పడవలు, 5,258 సాయుధ వాహనాలు, 1,648 ఆయుధ వ్యవస్థలు, 372 బహుళ రాకెట్ లాంచర్లు, 4,006 వాహనాలు, ఇంధన ట్యాంకులు, 189 యుద్ధ విమాన నిర్వీర్య వ్యవస్థలు, 329 రష్యా క్రూజ్ క్షిపణులను యుక్రెయిన్ సైన్యం ధ్వంసం చేసిందంట.

సుమారు ఎనిమిది నెలలుగా సాగుతున్న ఇరు దేశాల మధ్య భీకరపోరులో యుక్రెయిన్ కు మద్దతుగా అగ్రరాజ్యం అమెరికాతో పాటు పలు దేశాలు నిలిచాయి. రష్యాపై ఆంక్షలుసైతం విధించాయి. అయినా రష్యా అధ్యక్షుడు పుతిన్ యుక్రెయిన్ పై యుద్ధం విషయంలో ఏ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. మరోవైపు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీసైతం రష్యాతో చర్చలకు ససేమీరా అంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు