Russia vs Ukraine War: మరోసారి పేలుళ్లతో దద్దరిల్లిన యుక్రెయిన్ రాజధాని కీవ్.. కామికేజ్ డ్రోన్లు ఉపయోగం..

యుక్రెయిన్ రాజధాని కీవ్ మరోసారి బాంబుల పేలుళ్లతో దద్దరిల్లింది. గత వారం రోజుల క్రితం వరుస క్షిపణి దాడులతో విరుచుకుపడిన రష్యా సైన్యం.. మరోసారి బాంబుల మోత మోగించింది. సోమవారం తెల్లవారు జామున 6.30 గంటల మధ్య మూడు పేలుళ్లు సంభవించాయి.

Russia vs Ukraine War: మరోసారి పేలుళ్లతో దద్దరిల్లిన యుక్రెయిన్ రాజధాని కీవ్.. కామికేజ్ డ్రోన్లు ఉపయోగం..

Russia vs Ukraine War

Russia vs Ukraine War: యుక్రెయిన్ రాజధాని కీవ్ మరోసారి బాంబుల పేలుళ్లతో దద్దరిల్లింది. గత వారం రోజుల క్రితం వరుస క్షిపణి దాడులతో విరుచుకుపడిన రష్యా సైన్యం.. మరోసారి బాంబుల మోత మోగించింది. సోమవారం తెల్లవారు జామున జరిగిన ఈ పేలుళ్లతో సెంట్రల్ షెవ్‌చెంకివ్‌స్కీ జిల్లాలో అనేక నివాస భవనాలు దెబ్బతిన్నాయని మేయర్ విటాలి క్లిట్ష్‌కో తెలిపారు. ఉదయం 6.30 గంటల మధ్య మూడు పేలుళ్లు సంభవించాయి. మొదటి పేలుడుకు కొద్దిసేపటి ముందు వైమానికి దాడి సైరన్లు మోగినట్లు తెలిపారు.

Russia vs Ukraine War: అణ్వాయుధ దాడికి పుతిన్ సిద్ధమవుతున్నాడా? నాటో సరిహద్దుకు కొద్దిదూరంలో 11 న్యూక్లియర్ బాంబర్లు..

సోమవారం తెల్లవారు జామున యుక్రెయిన్ రాజధానిపై రష్యా సైన్యం జరిపిన దాడుల్లో ‘కామికేజ్ డ్రోన్’ వినియోగించినట్లు యుక్రెయిన్ ప్రెసిడెంట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఆండ్రీ యెర్మాక్ తెలిపారు. ఇరాన్ లో తయారు చేసిన డ్రోన్లను బహుళ ప్రాంతాలపై దాడికి ఉపయోగించినట్లు ఆయన అన్నారు. ఇదిలాఉంటే .. అక్టోబరు 16న ఒక గంటలోపు దక్షిణ ప్రాంతంలో ఎయిర్ కమాండ్ “సౌత్” యొక్క విమాన నిరోధక క్షిపణి యూనిట్లచే  షాహెద్-136 కామికేజ్ డ్రోన్‌లు ధ్వంసమయ్యాయని యుక్రెయిన్ వైమానిక దళం పేర్కొంది. కీవ్ ఇండిపెండెంట్ నివేదిక ప్రకారం.. నేషనల్ గార్డ్, యుక్రెయిన్ టెరిటోరియల్ డిఫెన్స్ ఫోర్సెస్ రెండు అదనపు షాహెద్-136 డ్రోన్‌లను కూల్చివేసినట్లు వైమానిక దళం పేర్కొంది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

యుక్రెయిన్ కమాండ్ “సౌత్” ప్రకారం.. తెల్లవారు జామున మైకోలైవ్‌లోని ఫార్మాస్యూటికల్ వేర్‌హౌస్‌తో పాటు పారిశ్రామిక సముదాయాలను మూడు డ్రోన్‌లు తాకినట్లు పేర్కొంది. రెస్క్యూ సిబ్బంది మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారని, అయితే ప్రాణనష్టం జరగలేదని పేర్కొంది. ఇక్కడ ఆందోళనకర విషయం ఏమిటంటే.. రష్యా సైన్యం గత గురువారం, ఈరోజు ఉదయం కీవ్‌ను లక్ష్యంగా చేసుకున్న సమయంలో ఇరాన్ తయారుచేసే కమికేజ్ డ్రోన్లు వినియోగించినట్లు తెలిసింది. అక్టోబర్ 10న రష్యా క్షిపణులు కీవ్, యుక్రెయిన్ అంతటా ఉన్న ఇతర నగరాలపై భారీ దాడులు జరిపింది. ఈ దాడుల్లో 19 మంది మరణించారు, మరో 105 మంది గాయపడ్డారు. అయితే, క్రిమియా ద్వీపకల్పంతో రష్యాను కలిపే కీలక వంతెనను ధ్వంసం చేసినందుకు ప్రతీకారంగానే ఈ దాడులు జరిపినట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు.