Russia vs Ukraine War: అణ్వాయుధ దాడికి పుతిన్ సిద్ధమవుతున్నాడా? నాటో సరిహద్దుకు కొద్దిదూరంలో 11 న్యూక్లియర్ బాంబర్లు..

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వ్యూహాత్మక అణ్వాయుద దాడికి సిద్ధమవుతున్నారనే వార్తలతో అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది.ఈ నేపథ్యంలో ఆర్కిటిక్ సర్కిల్‌కు ఎగువన ఉన్న ఒలెన్యా ఎయిర్‌బేస్ వద్ద అణ్వాయుధాలను మోసుకెళ్లగలిగే 11 అణు బాంబర్లను రష్యా సైన్యం మోహరించినట్లు ఉపగ్రహ ఛాయాచిత్రాలు వెలుగులోకి తెచ్చాయి.

Russia vs Ukraine War: అణ్వాయుధ దాడికి పుతిన్ సిద్ధమవుతున్నాడా? నాటో సరిహద్దుకు కొద్దిదూరంలో 11 న్యూక్లియర్ బాంబర్లు..

Russian vs Ukraine War

Russia vs Ukraine War: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వ్యూహాత్మక  అణ్వాయుధ దాడికి సిద్ధమవుతున్నారన్న వార్తలతో అతర్జాతీయంగా ఆందోళన పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆర్కిటిక్ సర్కిల్‌కు ఎగువన ఉన్న ఒలెన్యా ఎయిర్‌బేస్ వద్ద అణ్వాయుధాలను మోసుకెళ్లగల పదకొండు బాంబర్లను మోహరించినట్లు ఉపగ్రహ ఛాయాచిత్రాలు వెలుగులోకి తెచ్చాయి. ఉక్రెయిన్ క్రిమియాను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తే అణ్వాయుధాలను ఉపయోగిస్తానని పుతిన్ తన వద్ద పేర్కొన్నట్లు ఎలోన్ మస్క్ తెలిపిన విషయం విధితమే. దీనికితోడు యుక్రెయిన్ ఉద్రిక్తతలు పెరగడంతో నాటో సరిహద్దుకు కేవలం 20 మైళ్ల దూరంలో పుతిన్ ఈ అణు బాంబర్లను మోహరించినట్లు తెలుస్తోంది.

Russian Soldiers Killed: రష్యా సైనిక శిక్షణా కేంద్రంపై కాల్పులు.. 11 మంది మృతి.. కాల్పులు జరిపింది ఎవరంటే?

కొత్త ఉపగ్రహ చిత్రాల ప్రకారం.. వ్లాదిమిర్ పుతిన్ ఫిన్నిష్, నార్వేజియన్ సరిహద్దులకు సమీపంలోని వైమానిక స్థావరం వద్ద  అణ్వాయుధాలను మోసుకెళ్లగల పదకొండు బాంబర్లను మోహరించారు. ఒలెన్యా ఎయిర్ బేస్ వద్ద వ్యూహాత్మక బాంబర్ల సంఖ్యను పుతిన్ పెంచుతున్నారు. ఆగస్టు 21 నుండి నాలుగు Tu-160 లను క్రమంగా పెంచాడు. కోలా ద్వీపకల్పంలో ఏడు Tu-160 వ్యూహాత్మక బాంబర్లు, నాలుగు Tu-95 విమానాలు ఉన్నాయి. స్వతంత్ర నార్వేజియన్ ఫ్యాక్ట్ చెకింగ్ వెబ్‌సైట్ Faktisk.no ప్రకారం.. అమెరికన్ శాటిలైట్ ఆపరేటర్ ప్లానెట్ నుండి డేటాను పొందింది.

Russia Nuclear weapons : రష్యా న్యూక్లియర్ దాడులు బెదిరింపులు .. గేమ్‌ ప్లాన్ రెడీ అంటున్న అమెరికా‌ .. తీవ్ర పరిణామాలు తప్పవంటున్న జీ7 దేశాలు

Tu-160 జెట్‌లు.. ఇప్పటివరకు తయారు చేయబడిన అతిపెద్ద, అత్యంత బరువైన మాక్ 2 యుద్ధవిమానాలు. ఇంధనం నింపకుండా 7,500 మైళ్లు నాన్‌స్టాప్‌గా ఎగురగలవు. 12 స్వల్ప-శ్రేణి అణు క్షిపణులను మోసుకెళ్లగలవు. Tu-95 వ్యూహాత్మక బాంబర్ల విషయానికొస్తే.. వీటిని బేర్స్ అని పిలుస్తారు. పుతిన్ యొక్క వైమానిక దళంలో అతిపెద్ద విమానాలలో కొన్ని, క్రూయిజ్ క్షిపణులు, భారీ అణు బాంబులను లాగగల సామర్థ్యం కలిగి ఉంటాయి.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

రెండు వారాల క్రితం జెరూసలేం పోస్ట్ ఎయిర్‌బేస్ వద్ద ఏడు అణు బాంబర్లను గురించి నివేదించినప్పుడు అంతర్జాతీయ ఆందోళనకు దారితీసింది. TU-160లు, TU-95ల ఉనికిని గుర్తించిన ఇజ్రాయెలీ గూఢచార సంస్థ ఇమేజ్‌శాట్ ఇంటర్నేషనల్ దీనిని హైలైట్ చేసింది. ఆర్మగెడాన్ విమానాలు సాధారణంగా మాస్కోకు ఆగ్నేయంగా 450 మైళ్ల దూరంలో ఉన్న ఎంగెల్స్ ఎయిర్ బేస్ వద్ద ఉంటాయి. బాంబర్లు నాటోలో సభ్యత్వం కలిగిన నార్వే సరిహద్దుకు దగ్గరగా ఉన్నాయి. త్వరలో అలయన్స్ సభ్యుడిగా మారనున్న ఫిన్లాండ్ నుండి 95మైళ్ల దూరంలో ఇవి ఉన్నాయి. యుక్రెయిన్‌లో రష్యా బలగాలకు ఎదురుదెబ్బలు తగులుతున్న క్రమంలో పుతిన్ తన దాడులను తీవ్రతరం చేసేందుకు అణ్వాయుధాలను ప్రయోగించే అవకాశం కూడా ఉందని అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది.