Russian Soldiers Killed: రష్యా సైనిక శిక్షణా కేంద్రంపై కాల్పులు.. 11 మంది మృతి.. కాల్పులు జరిపింది ఎవరంటే?

నైరుతి రష్యాలోని బెల్గోరోడ్ ప్రాంతంలోగల సైనిక శిక్షణా కేంద్రంపై శనివారం ఇద్దరు ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఉగ్రవాదుల కాల్పుల్లో 11మంది రష్యా శిక్షణ సైనికులు మరణించారు. మరో 15మందికి గాయాలయ్యాయి.

Russian Soldiers Killed: రష్యా సైనిక శిక్షణా కేంద్రంపై కాల్పులు.. 11 మంది మృతి.. కాల్పులు జరిపింది ఎవరంటే?

Russian military

Updated On : October 16, 2022 / 9:07 AM IST

Russian Soldiers Killed: నైరుతి రష్యాలోని బెల్గోరోడ్ ప్రాంతంలోగల సైనిక శిక్షణా కేంద్రంపై శనివారం ఇద్దరు ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఉగ్రవాదుల కాల్పుల్లో 11మంది రష్యా శిక్షణ సైనికులు మరణించారు. మరో 15మందికి గాయాలయినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ కాల్పులు జరిపింది ఇద్దరు మాజీ సోవియట్ రిపబ్లిక్‌కు చెందిన పౌరులుగా గుర్తించారు. కాల్పులు తరువాత వారిని రష్యా సైనికులు హతమార్చినట్లు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే, ఈ ఘటనను ఉగ్రవాద దాడిగా మంత్రిత్వ శాఖ పేర్కొంది.

Russia vs Ukraine War: ఇక యుక్రెయిన్‌పై ‘భారీ’ క్షిపణి దాడులు చెయ్యం.. రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక నిర్ణయం..

రష్యా, యుక్రెయిన్ దేశాల మధ్య భీకరపోరు జరుగుతుంది. యుక్రెయిన్ లోని పలు ప్రాంతాలపై రష్యా క్షిపణులతో విరుచుకుపడుతుంది. అయితేకా, యుక్రెయిన్ పై యుద్ధం చేసేందుకు రష్యా ప్రభుత్వం ఆదేశంలోని యువత, నడివయస్కులకు శిక్షణ ఇస్తుంది. ఈ క్రమంలో వారికి శిక్షణ పొందుతున్న క్రమంలో ఇద్దురు మాజీ సోవియట్ రిపబ్లిక్ కు చెందిన వారు ఒక్కసారిగా కాల్పులకు దిగారు. ఊహించని ఈ కాల్పుల్లో 11మంది శిక్షణ పొందుతున్న సైనికులు మరణించగా, 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే వీరిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అక్కడి అధికారులు తెలిపారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఉదయం 10 గంటలకు కాల్పులు జరిపినట్లు తెలిసింది. అయితే ఈ విషయం సాయంత్రం బయటకు తెలిసింది. వారిద్దరు కాల్పులు జరపడానికి గల కారణాలపై రష్యా అధికారులు ఆరాతీస్తున్నారు. ఇదిలాఉంటే సైనిక చేరికలను పెంచుతున్నట్లు సెప్టెంబర్ 21న రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రెండు లక్షలకుపైగా సైన్యం చేరినట్లు తెలుస్తోంది.