Russia vs Ukraine War: ఇక యుక్రెయిన్‌పై ‘భారీ’ క్షిపణి దాడులు చెయ్యం.. రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక నిర్ణయం..

రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక నిర్ణయం ప్రకటించారు. యుక్రెయిన్‌పై యుద్ధాన్నిరోజురోజుకు తీవ్రతరం చేస్తున్న పుతిన్.. ఉన్నట్లుండి మనసు మార్చుకున్నాడు. యుక్రెయిన్‌పై మరిన్ని 'భారీ' క్షిపణి దాడులు అవసరం లేదని శుక్రవారం పుతిన్ పేర్కొన్నాడు.

Russia vs Ukraine War: ఇక యుక్రెయిన్‌పై ‘భారీ’ క్షిపణి దాడులు చెయ్యం.. రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక నిర్ణయం..

Russia President Putin

Russia vs Ukraine War: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక నిర్ణయం ప్రకటించారు. యుక్రెయిన్‌పై యుద్ధాన్నిరోజురోజుకు తీవ్రతరం చేస్తున్న పుతిన్.. ఉన్నట్లుండి మనసు మార్చుకున్నాడు. యుక్రెయిన్‌పై మరిన్ని ‘భారీ’ క్షిపణి దాడులు అవసరం లేదని శుక్రవారం పుతిన్ పేర్కొన్నాడు. యుక్రెయిన్ క్షిపణిదాడులను తాత్కాలికంగా ఆపివేస్తున్నట్లు, ఇకపై రష్యా భీకర దాడులు చేయదని వెల్లడించాడు.

Maharashtra: థానేలో దారుణ ఘటన.. విద్యార్థినిని వేదింపులకు గురిచేసి ఈడ్చుకెళ్లిన ఆటో డ్రైవర్.. వీడియో వైరల్

రష్యా, క్రిమియాను కలిపే కెర్చ్ బ్రిడ్జిపై పేలుళ్ల తరువాత యుక్రెయిన్ పై రష్యా దాడులను తీవ్రతరం చేసింది. డజన్లకొద్దీ క్షిపణుల వర్షం కురిపించింది. దీంతో యుక్రెయిన్ లోని పలు ప్రాంతాలు భారీగా దెబ్బతిన్నాయి. 19 మంది మరణించారు. అనేక మంది గాయపడ్డారు. దీంతో మరోసారి ప్రపంచం ఉలిక్కిపడింది. రష్యాపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐరోపా సమాఖ్య ఈ దాడులను తీవ్రంగా ఖండించి పుతిన్ యుద్ధ నేరాలకు పాల్పడుతున్నట్లు విమర్శించింది. యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ రష్యా తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పుతిన్ యుక్రెయిన్ ను నాశనం చేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

ఈ విషయంపై పుతిన్ మాట్లాడుతూ.. యుక్రెయిన్ ను సర్వనాశనం చేయడం తమ లక్ష్యం కాదని అన్నారు. అందుకే క్షిపణి దాడులు ఆపేస్తున్నట్లు చెప్పారు. పుతిన్ ప్రకటనతో కొద్దిరోజులుగా యుక్రెయిన్ , రష్యా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదిలాఉంటే గత నెలలో ఉజ్బెకిస్తాన్‌లో జరిగిన ఒక శిఖరాగ్ర సమావేశంలో దేశాల నాయకులు తనతో విభేదించినట్లు కనిపించిన ఒక నెల తరువాత, ఉక్రెయిన్‌లో “శాంతియుత చర్చలకు” భారతదేశం, చైనా మద్దతు ఇచ్చాయని వ్లాదిమిర్ పుతిన్ చెప్పారు.