Digital Detox Challenge
Digital Detox Challenge : చేతిలో సెల్ ఫోన్ లేకపోతే మైండ్ పనిచేయని పరిస్థితి. అలాంటిది ఒక నెలపాటు సెల్ ఫోన్‌కి దూరంగా ఉంటే లక్షల రూపాయలు గెలుచుకునే ఛాన్స్. ఈ అవకాశాన్ని ఇస్తోంది అమెరికన్ యోగర్ట్ కంపెనీ సిగ్గిస్ డైరీ. అసలు ఈ పోటీ పెట్టడం వెనుక కారణం ఏంటి? చదవండి.
Screen Addiction : సెల్ ఫోన్ అడిక్షన్ నుండి బయటపడాలా? జస్ట్ బ్లాక్ వాల్ పేపర్ సెట్ చేసుకోండి చాలు..
మీ ఫోన్, లేదా కంప్యూటర్ మరియు సోషల్ మీడియాతో సహా ఎటువంటి డిజిటల్ డివైజ్‌లు ఒక నిర్ణీత వ్యవధి వరకు ఉపయోగించకుండా ఉండటాన్ని ‘డిజిటల్ డిటాక్స్’ అంటారని చాలామందికి తెలుసు. సిగ్గిస్ డైరీ అనే పెరుగును తయారు చేసే అమెరికన్ కంపెనీ డిజిటల్ డిటాక్స్ ఛాలెంజ్ పేరుతో ప్రజల్ని పోటీకి పిలుస్తోంది. ఆసక్తికరంగా ఉన్నఈ ఛాలెంజ్‌లో గెలిస్తే అక్షరాల $ 10,000 (ఇండియన్ కరెన్సీలో రూ.8.3 లక్షలు) చెల్లించడానికి సిద్ధంగా ఉంది. అంతేకాదు అనేక వస్తువులు, నగదు బహుమతులు పొందే అవకాశం కూడా. ‘సిగ్గి యొక్క డిజిటల్ డిటాక్స్ ప్రోగ్రామ్‌లో భాగంగా మీ స్మార్ట్ ఫోన్‌ను ఒక నెలపాటు వదులుకోమని సవాల్ చేస్తున్నాము’ అంటూ సిగ్గీస్ డైరీ సవాల్ విసిరింది. ఈ పోటీలో పాల్గొనే వారు మీ స్మార్ట్ ఫోన్లను ఒక నెల పాటు లాక్‌బాక్స్‌లో ఉంచాలి. ఈ పోటీలో గెలిస్తే ఫ్లిప్ ఫోన్, ప్రీపెయిడ్ బ్యాలెన్స్‌తో కూడిడా సిమ్ కార్డు, 3 నెలల విలువైన సిగ్గి పెరుగు బహుమతులు ఉన్నాయి.
Phone to the washroom : టాయిలెట్‌కి సెల్ ఫోన్ తీసుకెళ్తున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
చాలామంది సెల్ ఫోన్‌తోనే జీవితం గడపడం వ్యసనంగా మారిపోయిందని.. సగటున ప్రతి వ్యక్తి రోజులో 5.4 గంటలు సెల్ ఫోన్‌తోనే గడుపుతున్నారని సిగ్గీస్ పేర్కొంది. దీని నుండి కాస్త విరామం ఎంత అవసరమో తెలిపేందుకు ఈ పోటీ నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. ఈ పోటీలో పాల్గొనాలంటే కొన్ని నియమాలు పెట్టింది. 18 ఏళ్ల వయసు పైబడిన వారు పోటీకి అర్హులట. జనవని 31 లోపు ఈ పోటీలో పాల్గొనవచ్చునట. అంతేకాదు డిజిటల్ డిటాక్స్ ఎందుకు అవసరమో తెలుపుతూ ఒక వ్యాసం రాసి పంపాలట. ఇక ఈ పోటీలో 10 మంది విజేతలను ఎంపిక చేస్తారట. కాన్సెప్ట్ బాగుంది.. పోటీలో బహుమతులు బాగున్నాయి. ఇక సవాల్‌కి ఓకే అయితే పోటీలో పాల్గొనడమే.
Here’s the link for the 10k for no phone usage for a month!
— Rod Ryan Show (@rodryanshow) January 19, 2024