Nobel Prize 2023 : నోబెల్ ప్రైజ్ మనీ పెంచారు.. ఇప్పుడెంతో తెలుసా?

నోబెల్ ప్రైజ్ అందుకోవాలని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేకమంది శాస్త్రవేత్తలు కలలు కంటారు. ఏటా అల్ఫ్రెడ్ నోబెల్ వర్థంతి రోజు అంటే డిసెంబర్ 10న ఇచ్చే ఈ బహుమతి మొత్తాన్ని పెంచారు? ఎంతంటే?

Nobel Prize 2023 : నోబెల్ బహుమతి అత్యున్నత పురస్కారం.. దీనిని అందుకోవాలని ప్రపంచ వ్యాప్తంగా ఎందరో శాస్త్రవేత్తలు కలలు కంటారు. జాతి, మతం, ప్రాతం అనే బేధం లేకుండా మానవ శ్రేయస్సుకు మేలు చేసిన వారికి నోబెల్ ప్రైజ్ ఇస్తుంటారు. ఇప్పటివరకు ఈ ప్రైజ్ క్రింద ఇస్తున్న మనీని ఈ ఏడాది పెంచారు. ఎంతంటే?

Malala Yousafzai : ఈ ‘బార్బీ’కి నోబెల్ బహుమతి ఉందంటూ మలాలా పోస్ట్

ఆల్ఫ్రెడ్‌ నోబెల్‌ అనే స్వీడిష్‌ శాస్తవ్రేత్త తన వీలునామాలో తన ఆస్తి మొత్తం అంటే 90 లక్షల డాలర్ల విలువైన ఆస్తుల నుంచి వచ్చే ఆదాయాన్ని ఏటా ఐదు రంగాలలో బహుమతులు ఇవ్వాలని నిర్దేశించారు. భౌతిక, రసాయనిక, శరీర నిర్మాణ లేక వైద్య శాస్త్రం, అత్యున్నత గ్రంథానికి సాహిత్యంలోనూ, అంతర్జాతీయ రంగంలో శాంతికిగాను విశిష్ట సేవ చేసినందుకు ఈ బహుమతులు ఇవ్వాలని ఆల్ఫ్రెడ్ నోబెల్ తన విల్లులో రాసినట్లు చెప్తారు. ఈ బహుమతులను ఏటా ఆఫ్రెడ్ నోబెల్ వర్థంతి రోజు అంటే డిసెంబర్ 10న ఇస్తారు. నోబెల్ బహుమతి గ్రహీతకు ఒక సర్టిఫికేట్, బంగారుపతకం, నగదు, నిర్ధారణ పత్రాలు ఇస్తారు.

PM Narendra Modi: మోదీకి నోబెల్ శాంతి బహుమతి? నోబెల్ ప్రైజ్ కమిటీ డిప్యూటీ చైర్మన్ ఆసక్తికర వ్యాఖ్యలు

స్వీడిష్ కరెన్సీ బాగా క్షీణించడంతో నోబెల్ ఫౌండేషన్ ఈ ఏడాది నోబెల్ బహుమతుల ప్రైజ్ మనీని 11 మిలియన్ క్రోనార్లకు (ఇండియన్ కరెన్సీలో 8,54,39,011.74) పెంచింది. స్వీడిష్ కరెన్సీ గణనీయమైన తరుగుదల కారణంగా నోబెల్ ఫౌండేషన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత 15 సంవత్సరాలుగా నోబెల్ బహుమతి విషయంలో అనేక సర్దుబాట్లు జరిగాయి. 2023 సంవత్సరానికి నోబెల్ బహుమతి గ్రహీతలను అధికారికంగా అక్టోబర్‌లో ప్రకటిస్తారు. డిసెంబర్ 10 న జరిగే వేడుకల్లో ప్రతిష్టాత్మక అవార్డు అందుకోవడానికి ఆహ్వానిస్తారు. ఇప్పటివరకు భారతీయులు, భారత సంతతికి చెందిన వారు, భారత పౌరసత్వం స్వీకరించినవారు ఇలా మొత్తంగా ఎనిమిది మంది ప్రముఖులు నోబెల్ ప్రైజ్ అందుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు