Dog Saved owner Life : యజమాని వేలు కొరికేసిన కుక్క .. ప్రాణం కాపాడిన కుక్కకు అదే వేలును ఆహారంగా వేసిన యజమాని

మరక మంచిదే అన్నట్లుగా యజమాని వేలును కొరికేసిన కుక్క అతని ప్రాణాలు కాపాడింది. ఎముక బయటకు కనిపించేలా వేలును కొరికేయటం వల్లే ఆ యజమాని బతికి ప్రాణాలతో బయటపడ్డాడు.

Dog Saved owner Life :  యూకేకి చెందిన డేవిడ్‌ లిండ్సే అనే వ్యక్తిని అతని పెంపుడు కుక్క కండ ఊడి వచ్చేలా కొరికేసింది..ఎముక కూడా బయటకు కనిపించేలా కొరికేసింది. భర్తను తమ పెంపుడు కుక్క కొరుకుతుంటే చూసిన భార్య ఆశ్చర్యపోయింది. కోపంగా దాన్ని కొట్టేలోపు భర్త నిద్ర లేచాడు. తన కాలు వద్ద కుక్క ఏం చేస్తుందాని లేచి చూసిన తరువాత ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే తన కాలి బొటనవేలి ఎముక బయటకు కనిపిస్తున్నా తనకు ఏమాత్రం నొప్పి తెలియకపోవటం. దీంతో తనకు ఏదో అయ్యిందని ఆందోళనపడ్డాడు. తన కాలు బొటనవేలుని కొరికేసిన విషయాన్ని గుర్తించి ఆశ్చర్యపోయాడు. ఎప్పుడూ తమపై ప్రేమ చూపించే తమ పెండుకు కుక్క ఎందుకిలా చేసిందో అర్థం గాక లిండ్స్‌ అతడి భార్య అయోమయానికి గురయ్యారు.

కుక్క కొరికేయటం వల్ల కాలి బొటనవేలి ఎముక బయటకు కనిపించేలా కొరికినా తనకు ఎందుకంటే తన కాలి బొటనవేలి ఎముక బయటకు కనిపిస్తున్నా తనకు ఏమాత్రం నొప్పి తెలియకపోవటంతో తనకు ఏదో అయ్యిందని ఆందోళనతో వెంటనే ఆస్పత్రికి వెళ్లాడు. అతనిని పరీక్షించిన డాక్టర్లు మీకు డయాబెటీస్‌ వచ్చిందని..అది తీవ్రస్థాయిలో ఉందని శరీరంలో రెండు దమనులు మూసుకుపోవడం వల్ల కాళ్లకు రక్తం సరిగా సరఫరా కావడం లేదని చెప్పారు. దీంతో అతను షాక్ అయ్యాడు.తన కుక్క గాయం చేస్తున్నా..తనకు స్పర్శ తెలియలేదని తెలుసుకున్నాడు. కానీ తన పెంపుడు కుక్క తనను కొరకటం వల్లే తాను ఆస్పత్రికి రాగలిగాననే అలా తన కుక్క తన ప్రాణాలు కాపాడిందని అర్థం చేసుకున్నాడు లిండ్స్.

కాలికి ఇన్ఫెక్షన్ సోకటంతో వేలు తీసేయాలని డాక్టర్లు సూచించారు.లేదాంటే అది శరీరానికి వ్యాపిస్తుందని కాబట్టి కాలివేలు తీసేయాలని తెలిపారు. దీంతో లిండ్స్ అంగీకారంతో డాక్టర్లు ఆపరేషన్ చేసి బొటనవేలు తీసేశారు. తన కుక్క అలా దాడి చేయడం వల్లే కదా డాక్టర్లు తనకు వచ్చిన ఈ సమస్యను గుర్తించారని లిండ్సే భావించి..నా కుక్క నాకు చేసిన గాయం మంచిదే అయ్యిందని తెలిపారు. అది గాయం చేయడం వల్లే నేను వైద్యం చేయించుకోగలిగానని..నా ప్రాణం కాపాడిన నా కుక్క నా ప్రాణదాత అనుకుని మురిపిపోయిన లిండ్స్ దాదాపు 10 రోజులు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న తరువాత డిశ్చార్చ్ అయ్యారు. డిశ్చార్జ్ అవుతు తీసివేసిన తన బొటనవేలిని తన కూడా ఇంటికి తెచ్చారు. ఆ బొటనవేలుని తన పెంపుడు కుక్కకు ఆహారంగా వేయటానికి ఇంటికి తీసుకెళ్లానని తెలిపారు. కానీ అలా చేయటం ఎంత వరకు సరైనది అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మనిషి మాంసానికి అలవాటు పడితే ప్రమాదమని సూచిస్తున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు