కుక్కలకు కరోనా ఎలా సోకిందంటే

  • Publish Date - May 17, 2020 / 02:23 AM IST

కరోనా వైరస్ మనుషులకే కాకుండా..జంతువులకు కూడా సోకుతూ..భయపెడుతోంది. పెంపుడు జంతువులకు కరోనా సోకుతుండడంపై నిపుణులు అధ్యయనం చేస్తున్నారు. తాజాగా హాంకాంగ్ లో రెండు కుక్కలకు యజమానుల ద్వారానే వైరస్ సోకిందని పరిశోధకులు నిర్ధారించారు. యజమానుల్లో ఉన్న జన్యు క్రమాన్ని విశ్లేషించిన తర్వాతే దీనిని నిర్ధారించారు. కానీ ఈ కుక్కల వల్ల ఇతర జంతువులకు, మనుషులకు సోకుతుందనే దానిపై ఆధారాలు లేవని వారు స్పష్టం చేశారు. బాధితులతో ఉన్న 15 కుక్కలో కేవలం రెండింటికి మాత్రమే వైరస్ వ్యాపించిందన్నారు. 

భవిష్యత్ లో మరింత ముప్పు రాకుండా ఉండాలంటే…పెంపుడు జంతువులపై అధ్యయనం చేయాలని పరిశోధకులు సూచిస్తున్నారు. హాంకాంగ్‌లో తాజాగా సోకిన రెండు కుక్కలతో పాటు, ఓ పిల్లి, న్యూయార్క్‌లో రెండు పిల్లులు, న్యూయార్క్ నగరంలోని బ్రోంక్స్ జంతు ప్రదర్శనశాలలో ఉన్నా నాలుగు పులులు, మూడు సింహాలు కూడా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. పిల్లులపై కూడా పరిశోధనలు నిర్వహించారు. వైరస్ ఉన్న వారు..పెంపుడు జంతువులకు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. 

పెంపుడు జంతువులను చూసుకొనే సమయంలో తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, ఏదైనా అనారోగ్యంతో బాధ  పడుతున్న వారు..పెంపుడు జంతువులకు దూరంగా ఉండడం బెటర్ అని అమెరికన్ వెటర్నరీ మెడికల్ అసోసియేషన్ వైద్యులు సూచిస్తున్నారు. హగ్ చేసుకోవడం నివారించాలని, వీటిని ముట్టుకున్న తర్వాత..తప్పనిసరిగా చేతులు శుభ్రం చేసుకోవాలన్నారు. 

ట్రెండింగ్ వార్తలు