Donald Trump : డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం.. భారతీయ విద్యార్థులకు భారీ షాక్‌!

Donald Trump : అమెరికాలో చదివి అక్కడే ఉద్యోగం చేయాలనుకునే విదేశీ విద్యార్థులకు భారీ షాక్ ఇచ్చేందుకు డొనాల్డ్ ట్రంప్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. అమెరికాలో చదివి అక్కడే ఉద్యోగం చేయాలనుకునే విదేశీ విద్యార్థులకు భారీ షాక్ ఇచ్చేందుకు డొనాల్డ్ ట్రంప్ సిద్ధమైనట్లు తెలుస్తోంది.

Donald Trump

Donald Trump : అమెరికాలో చదివి అక్కడే ఉద్యోగం చేయాలనుకునే విదేశీ విద్యార్థులకు భారీ షాక్ ఇచ్చేందుకు డొనాల్డ్ ట్రంప్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. అమెరికాలో చదువుకొని.. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) చేయాలనుకునే విద్యార్థులకు లక్ష డాలర్ల ఫీజు (దాదాపు రూ.95లక్షలు) విధించాలనే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు సమాచారం. యూఎస్‌ విశ్వవిద్యాలయాల్లో చదువు పూర్తయిన తర్వాత అక్కడే ఉండి ఉద్యోగం చేయాలనుకునేవారికి ఇది పెద్ద ఎదురుదెబ్బ కానుంది.

Also Read : E20 Petrol Price: ఇథనాల్ కలపకపోతే పెట్రోల్ లీటర్ ఎంతయ్యేదో తెలుసా.. పార్లమెంట్ లో లెక్కలు రాసిచ్చిన ప్రభుత్వం..

ప్రస్తుతం అమెరికాలో ఎఫ్-1 విద్యార్థి వీసాపై చదువుతున్న భారత్ సహా విదేశీ విద్యార్థులు కోర్సు పూర్తయిన తర్వాత ఓపీటీ ద్వారా తమ చదువుకు సంబంధించిన రంగంలో 12 నెలల పాటు ఉద్యోగం చేయవచ్చు. సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, గణితం (స్టెమ్) కోర్సులు పూర్తి చేసిన వారికి అదనంగా 24 నెలల పొడిగింపు లభిస్తుంది. ఈ అవకాశాన్ని ప్రతి ఏడాది లక్షలాది మంది, ముఖ్యంగా భారతీయ విద్యార్థులు వినియోగిస్తున్నారు.

ఓపీటీ విధానం కింద ఉద్యోగ అనుమతి పొందే విదేశీ విద్యార్థులపై 1లక్ష అమెరికన్ డాలర్లు (సుమారు రూ.95 లక్షలు) ఫీజు విధించే ప్రతిపాదనను అమెరికా సర్కార్ పరిశీలిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. అయితే ఈ ప్రతిపాదనపై ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని అధికారులు తెలిపారు. ఒకవేళ ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విదేశీ విద్యార్థులపై భారీ ఆర్థిక భారం పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ట్రంప్ సర్కార్ కొత్త ప్రతిపాదనను అమల్లోకి తీసుకొస్తే.. ముఖ్యంగా భారతీయ విద్యార్థులకు ఎక్కువగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అలాగే అంతర్జాతీయ విద్యార్థులపై ఆధారపడే అమెరికా విశ్వవిద్యాలయాల ప్రవేశాలు, ఆదాయంపైనా ప్రతికూల ప్రభావం పడవచ్చని విశ్లేషిస్తున్నారు. అయితే, ఈ ఫీజును విద్యార్థులు చెల్లించాలా, యజమాన్య సంస్థలు భరించాలా, లేక విశ్వవిద్యాలయాలే చెల్లించాలా అనే అంశంపై ఇంకా స్పష్టత లేదు. అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ ఈ ప్రతిపాదనను పరిశీలిస్తున్నప్పటికీ, ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక నిబంధనను ప్రకటించలేదు.

ఇదిలా ఉంటే, హెచ్-1బీ వీసాలపై గతంలో ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించిన 1 లక్ష డాలర్ల ఫీజుకు ఫెడరల్ కోర్టు బ్రేక్ వేసిన విషయం తెలిసిందే. విదేశీ ఉద్యోగులపై కంపెనీల ఆధారాన్ని తగ్గించి, అమెరికన్ పౌరులకు ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ భారీ ఫీజును ప్రతిపాదించారు. అయితే, ఈ నిర్ణయంపై న్యాయపరమైన సవాళ్లు రావడంతో ఫెడరల్ కోర్టు దానిని అమలు కాకుండా నిలిపివేసింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అమెరికాలో చదువు పూర్తి చేసిన విదేశీ విద్యార్థులు ఉద్యోగం చేయాలంటే 1 లక్ష డాలర్ల ఫీజు విధించే కొత్త ప్రతిపాదనను ట్రంప్ ప్రభుత్వం పరిశీలించడం ప్రాధాన్యత సంతరించుకుంది.