×
Ad

Trump Escalator : ట్రంప్ దంపతులు ఎక్కగానే ఆగిపోయిన ఎస్కలేటర్‌.. మెలానియా సీరియస్ లుక్.. షాకింగ్‌ నిర్ణయం తీసుకున్న వైట్‌‌హౌజ్‌

Trump Escalator: ఐక్యరాజ్య సమితి సమావేశాలకు హాజరయ్యేందుకు వెళ్లిన డొనాల్డ్ ట్రంప్, మెలానియాకు చేదు అనుభవం ఎదురైంది.

Trump Escalator

Trump Escalator: ఐక్యరాజ్య సమితి సమావేశాలకు హాజరయ్యేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అమెరికా ప్రథమ మహిళ మెలానియా కలిసి వెళ్లారు. అయితే, ఈ సమావేశాల సమయంలో ట్రంప్‌నకు వరుస చేదు అనుభవాలు ఎదురయ్యాయి.

Also Read: Emmanuel Macron: ఆ దేశ అధ్యక్షుడికే షాక్ ఇచ్చిన అమెరికా పోలీసులు.. నడిరోడ్డుపైనే ఇలా.. వీడియో..

సమావేశ వేదిక వద్దకు వెళ్లేందుకు మెలానియాతో కలిసి ట్రంప్ బయలుదేరారు. ఈ క్రమంలో వీరిద్దరూ అక్కడి ఎస్కలేటర్ ఎక్కారు. తొలుత మెలానియా ఎక్కగా.. ఆ తరువాత ట్రంప్ ఎస్కలేటర్ పైకి ఎక్కారు. ఏం జరిగిందో ఏమోగానీ.. ట్రంప్ ఎక్కగానే ఎస్కలేటర్ ఆగిపోయింది. దీంతో మెలానియా ఒకింత అసహనానికి గురైంది. ఎస్కలేటర్ ఆగిపోవడంతో సీరియస్ లుక్ ఇచ్చింది. వెంటనే ఎస్కలేటర్ పై నడుచుకుంటూ మెలానియా ముందుకు కదిలింది.. దీంతో ట్రంప్, ఆయన భద్రతా సిబ్బందిసైతం ఎస్కలేటర్ పై నడుచుకుంటూ వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

డొనాల్డ్ ట్రంప్ ఐరాస సభలో ప్రసంగిస్తున్న సమయంలోనూ ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. సభలో ఆయన మాట్లాడుతున్న సమయంలో టెలిప్రాంప్టర్ పనిచేయలేదు. ఆ తరువాత ట్రంప్ మాట్లాడుతూ.. ఈరోజు ఐరాసలో నాకు రెండు విషయాలు ప్రతికూలంగా జరిగాయి. ఒకటి చెత్త ఎస్కలేటర్, రెండోది పనిచేయని టెలిప్రాంప్టర్ అని తన ప్రసంగాన్ని ట్రంప్ ప్రారంభించారు.

ట్రంప్, మెలానియా ఎక్కిన సమయంలో ఎస్కలేటర్ ఆగిపోయిన ఘటనను వైట్‌హౌస్ సీరియస్ గా తీసుకుంది. దీనిపై దర్యాప్తు చేయాలని ఆదేశించింది. అమెరికా అధ్యక్షుడు, ప్రథమ మహిళ ఎక్కిన వెంటనే ఎస్కలేటర్ ను ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఆపి ఉంటే.. వారిని తక్షణమే విధుల నుంచి తప్పించి దర్యాప్తు జరిపించాలని వైట్‌హౌస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ఎక్స్ లో వెల్లడించారు.

ఐక్యరాజ్య సమితి సమావేశాలకు హాజరైన సమయంలో ట్రంప్ కు ఎదురైన రెండు ప్రతికూల ఘటనలపై ఐక్యరాజ్య సమితి స్పందించింది. ఐక్యరాజ్య సమితి అధికార ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ మాట్లాడుతూ.. ఎస్కలేటర్ పైన ఉన్న బిల్ట్‌ఇన్ సేఫ్టీ మెకానిజం బటన్ ను నొక్కడం వల్లే అది ఆగిపోయినట్లు సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ గుర్తించిందని చెప్పారు. ట్రంప్, మెలానియా ఎస్కలేటర్ వద్దకు రావడానికి కొన్ని నిమిషాల ముందు ఆయన వీడియో గ్రాఫర్ ఎస్కలేటర్ పైకి వెళ్లారు. అక్కడి నుంచి వారి వీడియో తీద్దామని అనుకున్నారు. ఆ సమయంలో అనుకోకుండా ఈ సేఫ్టీ ఫంక్షన్ బటన్ ను నొక్కి ఉండి ఉండొచ్చు అని స్టీఫెన్ డుజారిక్ పేర్కొన్నారు.