Emmanuel Macron: ఆ దేశ అధ్యక్షుడికే షాక్ ఇచ్చిన అమెరికా పోలీసులు.. నడిరోడ్డుపైనే ఇలా.. వీడియో..
ఏం జరిగింది, ఎందుకు నా వాహనాన్ని ఆపేశారు అని పోలీసులను అడిగారు.

Emmanuel Macron: ఆయన ఓ దేశానికి అధ్యక్షుడు. ఆ దేశానికే పెద్ద. ప్రముఖ రాజకీయ నాయకుడు. కానీ, అమెరికా పోలీసులు ఆయనకు పెద్ద షాక్ ఇచ్చారు. పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. నడిరోడ్డుపైనే నిలబెట్టారు. రోడ్డు నడిచి వెళ్లేలా చేశారు. ఇంతకీ ఆ ప్రెసిడెంట్ ఎవరు, అసలేం జరిగింది అంటే..
ఆ దేశ అధ్యక్షుడు ఎవరంటే.. ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఎమ్మాన్యుయల్ మాక్రాన్. అమెరికాలో ఆయనకు ఊహించని పరిణామం ఎదురైంది. అమెరికా పోలీసులు ఆయనను నడిరోడ్డుపై నిలబెట్టారు. అంతేకాదు నడుచుకుంటూ వెళ్లే పరిస్థితి కల్పించారు.
యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ సమావేశంలో పాల్గొనడానికి మాక్రాన్ న్యూయార్క్ చేరుకున్నారు. ఫ్రెంచ్ ఎంబసీకి వెళ్తున్న సమయంలో పోలీసులు ఆయన కారుని ఆపేశారు. దీంతో మాక్రాన్ తన కారులో నుంచి బయటకు వచ్చారు. పోలీసులతో మాట్లాడారు. ఏం జరిగింది, ఎందుకు నా వాహనాన్ని ఆపేశారు అని పోలీసులను అడిగారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాన్వాయ్ ఆ రోడ్డులో ప్రయాణిస్తున్నందున మీ వాహనాన్ని ఆపేశామని వారు వివరించారు.
ఆ వెంటనే మాక్రాన్ ఏకంగా ట్రంప్‌కే ఫోన్ చేశారు. తన పరిస్థితిని ట్రంప్ కి వివరించారు. ‘ట్రంప్.. ఏమైందో గెస్ చేయండి.. మీ పోలీసులు నన్ను రోడ్డుపైనే ఆపేశారు. మీ కాన్వాయ్ వస్తోందని నన్ను నిలిపేశారు. మీ కారణంగా ఇక్కడ దారి మూసేశారు’ అంటూ సరదాగా ట్రంప్‌తో మాట్లాడారు. అనంతరం మాక్రాన్ నడుచుకుంటూ వెళ్లిపోయారు. కేవలం పాదచారుల కోసం మాత్రమే రోడ్డును తెరవడంతో మాక్రాన్ కు కూడా నడక తప్పలేదు.
మాక్రాన్ న్యూయార్క్ వీధుల్లో నడిచుకుంటున్న వెళ్తున్న సమయంలో కొంతమందితో ఆయనతో మాట్లాడారు. ఫోటోలు కూడా దిగారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కాగా, మాక్రాన్ ను ఆపిన పోలీస్.. ఆయనకు క్షమాపణలు చెప్పాడు. ట్రంప్ కాన్వాయ్ వస్తున్న కారణంగా రోడ్డును మూసివేశామని, తాము ఏమీ చేయలేము అని మాక్రాన్ కు వివరించారు.
Also Read: హనుమాన్ పై ట్రంప్ పార్టీ నేత సంచలన వ్యాఖ్యలు.. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా..
View this post on Instagram