Truth App : ఇక కాస్కోండి.. ఫేస్‌బుక్, ట్విట్టర్‌‌కు పోటీగా ట్రంప్ ‘ట్రూత్’ యాప్!

ఫేస్‌బుక్, ట్విట్టర్లకు పోటీగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త యాప్ లాంచ్ చేయనున్నారు. ట్రూత్ యాప్ పేరుతో ఈ యాప్ తీసుకొస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు

Donald Trump Truth Social app : సోషల్ దిగ్గజాలైన ఫేస్‌బుక్, ట్విట్టర్లకు పోటీగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త యాప్ లాంచ్ చేయనున్నారు. ట్రూత్ యాప్ పేరుతో ఈ యాప్ తీసుకొస్తున్నట్టు ట్రంప్ స్వయంగా ప్రకటించారు.  వచ్చేనెలలో ఈ యాప్ అందుబాటులోకి రానుందని ఆయన పేర్కొన్నారు. గతంలో సోషల్ మీడియాలో ట్రంప్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ ఫేస్‌బుక్, ట్విట్టర్ ఆయన అకౌంట్లను బ్యాన్ చేశాయి.

ఇటీవలే ట్విట్టర్‌లో తాలిబన్లపై ట్రంప్ సంచలన ఆరోపణలు చేశారు కూడా. తొలుత ఆయనపై తాత్కాలిక నిషేధం విధించాయి. అనంతరం తమ సోషల్ ప్లాట్ ఫాంలపై పూర్తిగా ట్రంప్‌పై నిషేధం విధించాయి. దాంతో ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫాంలపై ఆధారపడితే ఇక కుదరదులే అనుకున్నారేమో.. వాళ్లు నన్ను బ్యాన్ చేసేదేంటీ.. నేనే సొంతంగా కొత్త సోషల్ ప్లాట్ ఫాం (Truth Social) క్రియేట్ చేయాలని నిర్ణయించుకున్నారు.
Amazon Prime: పెరగనున్న అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ రేటు.. Check Details

అలా ట్రంప్ ఆలోచన నుంచి పుట్టిందే.. ఈ ట్రూత్ యాప్.. (Trump Media & Technology Group (TMTG) ఇకపై తన సొంత యాప్‌లో తనకు ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడుకోవచ్చులే అనుకున్నారేమో.. ఏదిఏమైనా ట్రంప్ సోషల్ యాప్ ట్రూత్ లాంచ్ చేస్తున్నట్టుగా ముందే ప్రకటించారు. ట్రంప్‌కు ఒక్క అమెరికాలోనే కాదు..

యావత్తూ ప్రపంచవ్యాప్తంగా ఫాలోయింగ్ ఉంది. దాని దృష్టిలో పెట్టుకుని ఫేస్‌బుక్, ట్విట్టర్ అకౌంట్లకు పోటీగా ఈ ట్రూత్ యాప్ ప్లాన్ చేశాడు. తన నోటి దురుసుతనంతో వివాదాల్లో నిలిచే ట్రంప్ సొంత యాప్ ను ఎంతమంది నమ్మి డౌన్‌లోడ్ చేసుకుంటారో లేదో చూడాలి. ఫేస్ బుక్, ట్విట్టర్ తరహాలో ట్రంప్ ట్రూత్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.
WiFi Cut : 2000 మందికి WiFi లేకుండా చేసిన ఎలుకలు..రంగంలోకి దిగిన ప్రభుత్వ అధికారులు

ట్రెండింగ్ వార్తలు